బెల్టు షాపు కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. రాళ్లు, కర్రలతో దాడి !

ప్రకాశం జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. బెల్టు షాపుల పంచాయతీ కాస్తా.. పొట్టుపొట్టుగా కొట్టుకునే వరకు దారి తీసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే నేతలు అధిపత్య పోరుతో దాడులు చేసుకునే దాకా రావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం సైతం ఈ ఘటనపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో బెల్ట్ షాప్ వ్యవహారం టీడీపీ నేతల మధ్య తీవ్ర స్థాయికి చేరింది. బెల్ట్ షాప్ ఏర్పాటు, ఆదాయ బాగా రావడం వంటి విషయాల్లో విభేదాలు తలెత్తి, టీడీపీకి చెందిన రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. తలలు పగిలి రక్తం కారేలా కొట్టుకోవడంతో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఊహించని ఘటనతో గ్రామం రణరంగంగా మారింది.

tdp-leaders-clash-over-belt-shop-in-prakasam-district-and-attacked-with-stones-and-sticks

బెల్టుషాపులు పెట్టుకొని మద్యం అమ్ముకునే విషయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నేత మన్నే రవీంద్ర వర్గంపై యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గం మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ నేత మన్నే రవీంద్ర వర్గంపై యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు వర్గం దాడి చేసి పొట్టు పొట్టుగా కొట్టారు. ఈ దాడిలో డాక్టర్ మన్నే రవీంద్ర భార్య మాధవి, బామ్మర్ది సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యుత్తరంగా మన్నే వర్గం కూడా దాడికి దిగడంతో ఎరిక్షన్ వర్గానికి చెందిన ముగ్గురు కార్యకర్తలు ఆస్పత్రి పాలయ్యారు.

ఇరువర్గాల దాడితో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని మిట్టపాలెం గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో త్రిపురాంతకం పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఘర్షణతో పార్టీకి తీవ్రంగా చెడ్డపేరు రావడమే కాదు, సీఎం చంద్రబాబు నాయుడికి అధికంగా తలనొప్పిగా మారింది.

పార్టీ నిబంధనలను బేఖాతరు చేస్తూ స్వప్రయోజనాల కోసం కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడటం, ఆ దాడుల్లో పౌరులు, మహిళలు గాయపడటం పార్టీకి అపఖ్యాతిని తెస్తోందని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు కొనసాగితే, పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉందని, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+