టీడీపీలో నాయకత్వ మార్పు - ఏం జరుగుతోంది..!!

ఏపీలో ఎన్నికల్లు గెలుపెవరిది. ఇప్పుడు ఈ అంశం ఉత్కంఠ పెంచుతోంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స..జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. గెలుపు పైన సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు సైతం భరోసాగా కనిపస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ నాయకత్వం మార్పు అంశం తెర మీదకు వచ్చింది. కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు చేస్తున్న తాజాగా డిమాండ్ పైన పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

నాయకత్వం మార్పు
తెలుగుదేశంలో నాయకత్వం మార్పు పైన సీనియర్లలో చర్చ మొదలైంది. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే, తాజాగా టిడిపి పగ్గాలు లోకేష్‌కు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌కు ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలిసింది. టిడిపి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్సీ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పార్టీ, కార్యకర్తల గురించి పట్టించుకోలేదనే అసంతృప్తి నేతల్లో ఉండటంతో..పలువురు ఓపెన్ గానే తమ అభిప్రాయాలను వెల్లడించారు.

TDP leaders Demands party leadership for Nara Lokesh chief ChandraBabu to take final decision

లోకేష్ కు బాధ్యతలు
2014 నుంచి టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరించిన లోకేష్‌ కూడా పార్టీ కార్యక్రమాలను విస్మరించారనే కొంత అసహనం కిందిస్థాయి నాయకుల్లో ఉంది. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో పార్టీ 23 శాసనసభ, మూడు లోక్‌సభ సీట్లకే పరిమితం కావాల్సి రావడం, రాజ్యసభలోనూ పార్టీ ప్రాతినిధ్యం లేకుండాపోయిందనే ఆందోళన వారిలో నెలకొంది. ఓటమి తరువాత కొద్దికాలం చంద్రబాబు సైలెంటుగా ఉండటంతో పార్టీ బాధ్యతలన్నీ లోకేష్‌ చూశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదనే కోణంలో కొంతమంది సీనియర్లు బేదాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

TDP leaders Demands party leadership for Nara Lokesh chief ChandraBabu to take final decision

చంద్రబాబు నిర్ణయం ఏంటి
దీంతో పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ గత మూడేళ్లుగా వేర్వేరు కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు నిర్వహించారు. లోకేష్‌ నిర్వహించిన 'యువగళం' పాదయాత్ర కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చిందని టిడిపి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల తరువాత...వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీలో కీలక నిర్ణయాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. వచ్చే సీట్లు..మిత్రపక్షాలతో భవిష్యత్ సమన్వయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. దీంతో..అసలు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+