Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఛలో నర్సీపట్నం - టీడీపీ నేతల గృహనిర్బంధం : అయ్యన్న కుటుంబ సభ్యుల దీక్ష..!!

టీడీపీ ఛలో నర్సీపట్నం పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. ఇరిగేషన స్థలంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని నిర్మించారంటూ ఆయన ఇంటి ప్రహరీ గోడను కూల్చి వేసారు. ఇది రాజకీయ వివాదంగా మారింది. దీని పైన అయ్యన్న కుమారులు హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు అర్ద్రరాత్రి కూల్చివేతలు ఏంటంటూ ప్రశ్నించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ కూల్చివేత నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ వైఖరి పైన టీడీపీ నేతలు మండిపడ్డారు. బీసీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు.

ఆ సమయంలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత అరెస్ట్ కోసం రాలేదని వివరణ ఇచ్చారు. ఇక, ఇదే సమయంలో ఛలో నర్సీపట్నం కు టీడీపీ పిలుపునిచ్చింది. ఆదివారం నుంచి అయ్యన్న అనుచరులు..టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి వద్దే ఉన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన కుమారుడు విజయ్ దీక్షకు దిగారు.

TDP leaders house arrest over Chalo Narsipatnam call, Chandra Babu slams CM Jagan

మెడలో నల్ల కండువా వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష ప్రారంభించారు. సీపీఐ నేతలు అయ్యన్న ఇంటిని సందర్శించారు. బుల్డోజర్ వ్యవస్థ మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకే అయ్యన్న పాత్రుడుని టార్గెట్ చేసారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర తెదేపా నేతలు అయ్యన్న కుటుంబానికి అండగా నిలిచారు.

దీంతో..పలువురు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతలను పోలీసులు ముందుగానే గృహనిర్బంధం చేయగా.. మరి కొందరు నేతలు పోలీసులను తప్పించుకొని అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి.. మాజీ ఎమ్మెల్యే కే ఏ నాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహనిర్బంధించారు. ఇదే వ్యవహారంలో కోర్టు తీర్పు వ్యాఖ్యలన ప్రస్తావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+