బొత్సా పై టీడీపీ అభ్యర్దిగా - జగన్ ధీమా వెనుక, గెలుపెవరిది..!!
సాగరతీరంలో మరో ఎన్నిక జరగనుంది. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ అభ్యర్ది ఖరారయ్యారు. మాజీ మంత్రి బొత్సాను వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసారు. స్థానిక సంస్థ ల్లో వైసీపీకి మెజార్టీ ఉంది. టీడీపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలనేది ఈ రోజు డిసైడ్ కానుంది. పోటీ చేయాలా వద్దా అనేది తుది నిర్ణయం తీసుకోనున్నారు. బొత్సా ఎంపిక వెనుక జగన్ గెలుపు ధీమా కనిపిస్తోంది. స్థానికంగా లెక్కలు కీలకంగా మారాయి.
ఎమ్మెల్సీ ఎన్నికతో
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక పైన ఫోకస్ చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్దిగా జగన్ మాజీ మంత్రి బొత్సాను ఖరారు చేసారు. స్థానికంగా ఉన్న బలంతో గెలుపు పైన జగన్ ధీమాగా ఉన్నారు. అయితే, మూడు పార్టీల కూటమి వ్యూహాల పైన అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా బొత్సాను అభ్యర్దిగా ప్రకటించటం ద్వారా పార్టీ ఓటర్లను నిలబెట్టు కోవటంతో పాటుగా ఎన్నికల వ్యూహాల పైన నమ్మకం ఉంచారు. తాజాగా పార్టీ నేతల సమావేశంలోనూ దిశా నిర్దేశం చేసారు.

వైసీపీ ధీమా వెనుక
ఈ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 615మంది వైసిపికి చెందినవారే. 215మంది టిడిపి చెందిన ఓటర్లు ఉండగా, మిగిలిన 11 ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో బొత్సకూడా పోటీకి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే, టిడిపి కూడా ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. మరో ఐదేళ్లు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో వైసిపి నుంచి జంపింగ్‌లు కూడా ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి.

కూటమి కొత్త ఆశలు
ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రూపంలో వైసీపీకి మంచి అవకాశం వచ్చింది. ఎన్టీయే కూటమి తమ అభ్యర్థి కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. విశాఖ పట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న గండి బాబ్జీ పేరు దాదాపు ఖరారు కావచ్చని ప్రచారం జరుగుతోంది. సీతంరాజు సుధాకర్, అనకాపల్లి టీడీపీ నేత షీలా గోవింద్, మైనారిటీ నేత నజీర్, సీనియర్ నేత దాడి వీరభద్రరావులు సైతం ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించే లిస్టులో ఉన్నారు. ఇక్కడ గెలుపు ద్వారా తమ సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. కూటమి కూడా వైసీపీకి మరోసారి దెబ్బకొట్టాలని అడుగులు వేస్తోంది. దీంతో, ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications