Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోడిపందాలపై ఎమ్మెల్యే చింతమనేని విచిత్ర వ్యాఖ్యలు: సంచలనమా, కామెడీనా?

దెందులూరు: కోడి పందాలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలను సీరియస్ గానే చేశారో లేక తమాషాకు చేశారో అనే విషయం విన్నవారే అర్థం చేసుకోవాలి తప్ప ఆయన ఏ వివరణ ఇవ్వలేదు.

Recommended Video

    Journalists from electronic media protest over TDP MLA Chintamaneni Prabhakar - Oneindia Telugu

    కోడిపందాలపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. చింతమనేని చేసిన తాజా వ్యాఖ్యలు తమాషాకు చేశారో లేక నిజంగానే తన అభిప్రాయాన్ని అలా వ్యక్తపరిచారో ఆయనే స్పష్టత ఇస్తే తప్ప అర్థం కాని పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక జోక్ ని బేస్ చేసుకొని చింతమనేని ఇలా కామెడీ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

     కోడిపందాలు...చింతమనేని వ్యాఖ్యలు...

    కోడిపందాలు...చింతమనేని వ్యాఖ్యలు...

    ఇంతకూ కోడిపందాలపై చింతమనేని ప్రభాకర్ ఏమన్నారంటే కోళ్లకు సహజంగానే కొట్టుకునే గుణం ఉంటుందని, అవి ఒకదానికొకటి తారసపడగానే సహజసిద్ధంగా కొట్టుకుంటాయని...అలా కొట్టుకున్న సమయంలో నలుగురు గూమికూడుతారని...అదికూడా సహజమేనని...అన్నారు. పైగా అలా కొట్టుకునే కోళ్లను సుప్రీంకోర్టు ఆపలేదని.. మనుషులైతేనే ఆపగలమంటూ ఆయన విచిత్రమైన లాజిక్‌ చెప్పారు.

     ఆ వ్యాఖ్యల భావమేమి...చింతమనేని...

    ఆ వ్యాఖ్యల భావమేమి...చింతమనేని...

    కోడి పందాల నిర్వాహణకు హై కోర్టు స్పష్టంగా నో చెప్పేసింది. జంతు హింస, జూదాన్ని సహించేది లేదంటూ తేల్చి చెప్పింది. అయితే దీనిపై స్పందించిన చింతమనేని...తాముగా కోడి పందాలు నిర్వహించడం లేదని...ఏవో రెండు కోళ్లు కొట్టుకుంటుంటే చూస్తాన్నామంతే అనేలా...ఆ విధంగా అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. కొట్టుకోవడం కోళ్లకు సహజంగా వచ్చిన లక్షణమన్నఆయన...అది చూడటం తప్పు కాదంటున్నారు. కాబట్టి హైకోర్టు ఆదేశాలను కూడా తాము ధిక్కరించమని చెబుతున్నారు. కోడి పందాలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలంటున్నారు.

     స్ఫూర్తి...సోషల్ మీడియానా?

    స్ఫూర్తి...సోషల్ మీడియానా?

    ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలకు స్ఫూర్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక జోక్ అంటున్నారు. ఆ జోక్ లో పోలీసులు కోడిపందాలు నిర్వాహకులను పట్టుకొని స్టేషన్ కు తీసుకువస్తే వారు ఇదే తరహాలో వాదిస్తారు. తాము కోడిపందాలను నిర్వహించడం లేదని...అవి కొట్టుకుంటుంటే చూస్తున్నామని..చెబుతారు...మరి మీ చేతిలో డబ్బులు ఎందుకు ఉన్నాయని పోలీసులు అడుగగా...అవి కొట్టుకుని గాయాలపాలైతే మానవతాధర్మం కింద చికిత్స చేయించాలి కాబట్టి ఆస్పత్రి ఖర్చులకోసమని చెబుతారు... ఇప్పుడు ఈ జోక్ వాట్సాప్, ఫేస్ బుక్ లలో బాగా వైరల్ కావడంతో దాని నుంచి స్ఫూర్తి పొంది చింతమనేని ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చంటున్నారు కొందరు. అయితే తానెందుకు అలా మాట్లాడానో స్వయంగా చింతమనేని చెబితే తప్ప ఆ వ్యాఖ్యల వెనుక భావం తెలియదని అభిప్రాయపడుతున్నారు.

     ఇంతకీ పందాలు ఉంటాయా?...ఉండవా?...

    ఇంతకీ పందాలు ఉంటాయా?...ఉండవా?...

    సంక్రాంతి పండగ సమీపిస్తోంది...కానీ కోడి పందాలపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఆదేశాల ప్రకారమైతే కోడిపందాలు జరగడానికి ఏమాత్రం వీల్లేదు. ఆ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై కోడి పందాల నిర్వాహకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు...మరి.. పర్మిషన్‌ వస్తుందా?...రాదా?...అన్న టెన్షన్‌ నెలకొంది. పందెంరాయుళ్లకు అయితే కంటి మీద కునుకు లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకుంటే...ఏం జరుగుతుంది?...స్పష్టత లేదు...కోడి పందాలు

     ఉండవనే...అంటున్న వ్యతిరేకులు

    ఉండవనే...అంటున్న వ్యతిరేకులు

    అయితే ఈ ఏడాది కోడిపందాలు ఉండవని ఈ పోటీలను వ్యతిరేకిస్తున్నవారు అంటుండగా గతేడాది కోడిపందాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీంతో కోడి పందాల నిర్వాహణకు అడ్డంకి లేకుండా పోయింది. కోడిపందాలను ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించరాదన్న హైకోర్టు ఆదేశాలపై ఇప్పటికే బీజేపీ నేత రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గతేడాది సుప్రీం స్టే ఇచ్చినా...హైకోర్టు మళ్లీ తమ ఆదేశాలనే అమలు చేయాలనడం ఇపుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు...కోడి పందాలు జరిగితే కోళ్లను కాకుండా కత్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇపుడు అవే ఆదేశాలు అమలు చేయాలంటున్నారు నిర్వాహకులు. హైకోర్టు ఆంక్షలు విధించినా సుప్రీంకోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+