టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసా? మజాకా?: బెల్ట్ షాపులపై ఆగ్రహం

Liquor Sales in Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లభిస్తోండటం, పాత బ్రాండ్లు మళ్లీ మార్కెట్‌లో అందుబాటులోకి రావడంతో మందుబాబుల కరవు తీరుతుంది. ఫలితంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాల్లో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,300 మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. ఊరూరా బెల్ట్ షాప్‌లు సైతం వెలిశాయి. మందుబాబులు కోరిన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి.

TDP MLA Kolikapudi Srinivas unhappy with Liquor belt shops in his Tiruvur constituency

ఈ నేపథ్యంలో- అక్టోబర్ 16 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. ఏకంగా 4,677 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నెలన్నర రోజుల వ్యవధిలో 61.63 లక్షల కేసుల మందు, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా వెలిసిన బెల్ట్ షాపులపై తిరుగుబాటుకు దిగారు. వాటిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు.

తిరువూరులో బెల్ట్ షాపుల వద్ద ఆందోళనకు దిగారు కొలికపూడి శ్రీనివాస్. బెల్ట్ షాపులను తొలగించాలని, వాటిని నిర్వహిస్తోన్న నాలుగు మద్యం షాపుల లైసెన్స్‌లను రద్దు చేయాలని ఆయన పట్టుబట్టారు. దీనికోసం 48 గంటల పాటు గడువు ఇచ్చారు. ఈ లోగా బెల్ట్ షాపులను తొలగించకపోతే తిరువూరులో మద్యం అనేదే లేకుండా చేసే బాధ్యత తనదేనని అన్నారు.

తిరువూరు టౌన్‌లో అధికారికంగా నాలుగు మద్యం షాపులు ఉన్నాయని, తనకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఆయా దుకాణాల యజమానులు 35 నుంచి 40 బెల్ట్ షాపులు దీనికి అదనంగా నడిపిస్తోన్నారని అన్నారు. ఇలా నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో 135 బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయని చెప్పారు.

ఒక మద్యం దుకాణదారుడు అదనంగా ఎన్నో బెల్ట్ షాప్‌లను నిర్వహిస్తోన్నాడని విమర్శించారు. ఈ నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలంటూ కొలికపూడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల గురించి మహిళలు ఎంతోమంది తన వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తోన్నారని కొలికపూడి పేర్కొన్నారు.

తిరువూరు- మధిర రోడ్డుతో పాటు పట్టణంలోని అనేక ప్రాంతాలు, జనావాసాల మధ్య బెల్ట్ షాపులు ఉన్నాయని, బస్టాండ్ వద్ద గల దుకాణం వద్ద కూర్చుని ఉదయం నుంచే తాగుబోతులు మద్యం సేవిస్తూ వచ్చీ పోయే వారిని ఇబ్బందులకు గురి చేస్తోన్నారని కొలికపూడి అన్నారు.

తిరువూరు టౌన్‌లో 40 బెల్ట్ షాపులు రద్దు కావాలంటే వాటిని నిర్వహిస్తోన్న నాలుగు దుకాణాల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 236 మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. క‌ృష్ణా- 123, ఎన్టీఆర్- 113 లిక్కర్ షాపులు ఉన్నాయి. వీటికి అదనంగా బెల్ట్ షాపుల గురించి లెక్కే ఉండట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+