చంద్రబాబుకు షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే నగేష్

బజార్‌హత్నూరు మండలం జాతర్ల గ్రామంలో నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, నాలుగైదు రోజుల్లో కె. చంద్రశేఖర రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్నట్లు ఆయన ఆ సమావేశంలో చెప్పారు.
ఇరవై ఏల్లుగా తన రాజకీయ జీవితానికి సహాయ పడిన తెలుగుదేశం పార్టీని వీడడం బాధగానే ఉన్నా ఇది అనివార్యమైందని నగేష్ అన్నారు. తెలంగాణ పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగానే తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మంది తమ పార్టీలోకి వస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అంటున్నారు. చివరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించారని వారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications