వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చుకుందాం రా: ఈటెల, అక్బర్ ఫైర్, 'టీడీపీ' సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మూలాలు చంద్రబాబు వద్ద, ఆంధ్రలో ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం అన్నారు. శాసన సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. విపక్షాలు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలను ఆయన అవహేళన చేశారని ధ్వజమెత్తారు. ఆయనను సభకు పిలిపించాలన్నారు. దీంతో మంత్రులు స్పందించారు.

సభలో పూర్తిస్థాయిలో చర్చ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈటెల తెలిపారు. మొదట విపక్షాలు కూర్చొవాలని, చర్చకు సహకరించాలన్నారు. పదేళ్లు జానా రెడ్డి మంత్రిగా ఉన్నారని, ఎప్పుడైనా వాయిదా తీర్మానాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. పచ్చజెండా పార్టీ సభ జరగవద్దని చూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావొద్దని టీడీపీ చూస్తోందన్నారు. విపక్షాలకు నిజాయితీ ఉంటే 1984 నుండి 2013 వరకు అన్నింటి పైనా మాట్లాడుదామన్నారు.

కరెంట్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. టీడీపీకి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆందోళన చెందుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి కావొద్దని చూస్తోందన్నారు. మీరు చేసింది చాలు.. కూర్చొండని మండిపడ్డారు. అన్ని సమస్యల పైన చర్చించుకుందామన్నారు. ఏదో రకంగా గొడవ చేసి సస్పెండ్ అయి బయటి పనులు చూసుకోవాలనుకుంటున్నారన్నారు.

TDP roots in Andhra Pradesh: Etela

గజ్వెల్ సంఘటనలో దోషులను శిక్షిస్తాం: హరీష్

మెదక్ జిల్లా గజ్వెల్‌లో జరిగిన సంఘటనలో దోషులను శిక్షిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తమకు ఎలాంటి బేషజాలు లేవన్నారు. సభకు విపక్షాలు సహకరించాయన్నారు. విపక్షాలు తాము ఏం చెప్పదలుచుకున్నాయో చెప్పాలన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా సభను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ప్రతిపక్షాలు ఆటంకం కలిగించవద్దన్నారు. ప్రతి ఒక్కరికి తాము అవకాశం ఇస్తామని చెప్పారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వ పథకాలు అమలైతే తమకు మనుగడ ఉండదని టీడీపీ భయపడుతోందన్నారు. తాము అన్ని పక్షాలతో పునర్నిర్మాణానికి పూనుకుంటే ప్రతిపక్షాలు కలిసి రావడం లేదన్నారు.

ఎదురు దాడి కాదు: ఎర్రబెల్లి

తాము సమస్యలు లేవనెత్తుతుంటే ఈటెల, హరీష్ రావులు ఎదురుదాడి చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. మీరు దాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అందరికీ మాట్లాడేందుకు అవకాశమివ్వాలన్నారు. రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసినందుకు పోచారం సభకు వచ్చి క్షమాపణ చెప్పాలన్నారు. గజ్వెల్‌లోనే అధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు అడ్డు తగిలేందుకు ప్రయత్నించగా... ఎదురు దాడి చేయడం మానేయాలని, ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. పోచారంను సభకు పిలిపించి బేషరతుగా రైతులకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పించిన తర్వాతే చర్చ ప్రారంభించాలన్నారు.

పుండు మీద కారం చల్లేలా: డాక్టర్ కే లక్ష్మణ్

బాధ్యత గల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పుండు మీద కారం చల్లేలా రైతుల ఆత్మహత్యల పైన వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించారు. విద్యుత్ సంక్షోభానికి కారణం ఎవరని నిలదీశారు. ఐదు నెలలుగా ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. తాము సభ జరగవద్దని చూడడం లేదని, మొదట పోచారం వ్యాక్యల పైన వివరణ ఇవ్వాలన్నారు. రైతుల ఆత్మహత్యల పైన చర్చ జరగాలన్నారు. వందలాంది మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధాకరం: జానా

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని జానారెడ్డి అన్నారు. దీని పైన చర్చ జరగాలన్నారు.

అంగీకరించారు: అక్బర్

ప్రశ్నోత్తరాల తర్వాతనే వాయిదా తీర్మానాల పైన చర్చకు బీఏసీలో అన్ని పక్షాలు అంగీకరించాయని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సభలో ఎవరు డ్రామాలో చేస్తున్నారో, ఎవరు తమాషా చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల పైన చర్చకు విపక్షాలు సుముఖంగా లేవని ఆరోపించారు.

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

విపక్షాలు సభకు సహకరించడం లేదని, అందుకే తాము వారిని సస్పెండ్ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఎర్రబెల్లి దయాకర రావు, మాగంటి గోపీనాథ్, గాంధీ, ఎం. కిషన్ రెడ్డి, కృష్ణా రావు, ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సాయన్న, మాధవ రావు, సండ్ర వెంకట వీరయ్యలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. వీరిని ఒక్కరోజు సస్పెండ్ చేశారు. సస్పెండైన సభ్యులు సభలోనే ఉండి నినాదాలు చేస్తుండటంతో వారు బయటకు వెళ్లిపోవాలని సభాపతి సూచించారు.

English summary
Telugudesam Party roots are in Andhra Pradesh, says Etela Rajender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X