జగన్‌కు ధీటైన కౌంటర్, రెఫరెండం.. అఖిలప్రియకు షాక్, టిడిపి చేతులెత్తేసిందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: ఉప ఎన్నికలు రాకుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుంటే సీఎం చంద్రబాబు నంద్యాలలో అభివృద్ధి పనులు చేసేవారా అన్న వైసిపి అధినేత జగన్‌కు టిడిపి ధీటైన కౌంటర్ ఇచ్చింది.

ఒళ్లంతా చెమటలు, స్పీచ్ కాగానే అలా కూర్చుండిపోయిన బాబు, దుబాయ్ నుంచి ఏపీకి...

జగన్‌! నువ్వు వచ్చేవాడివా

జగన్‌! నువ్వు వచ్చేవాడివా

అసలు ఉప ఎన్నికలు లేకుంటే జగన్ నంద్యాలకు వచ్చేవారా అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. ఉప ఎన్నికల కోసమే జగన్, వైసిపి నేతలు నంద్యాలకు క్యూ కట్టారని ఎద్దేవా చేశారు.

జగన్ విమర్శలు

జగన్ విమర్శలు

నంద్యాలలో మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు చాలామంది తిష్ట వేశారని వైసిపి నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ విమర్శిస్తున్నారు. అలాగే, నంద్యాలలో చేస్తున్న అభివృద్ధి పనులు ఉప ఎన్నికల కారణంతోనే అన్నారు. దానికి టిడిపి పైవిధంగా కౌంటర్ ఇచ్చింది.

టిడిపి చేతులెత్తేసిందా, జగన్-రోజాలు చెప్పింది నిజమా

టిడిపి చేతులెత్తేసిందా, జగన్-రోజాలు చెప్పింది నిజమా

నంద్యాల ఉప ఎన్నికలపై టిడిపి నేత కేఈ కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికలను తాము రెఫరెండంగా తీసుకోవడం లేదని, సవాల్‌గా తీసుకున్నామని చెప్పారు. అంటే జగన్, రోజాలు చెప్పినట్లు టిడిపికి ఓటమి భయం పట్టుకుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రెఫరెండం అని ఎందుకు చెప్పడం లేదు

రెఫరెండం అని ఎందుకు చెప్పడం లేదు

టిడిపి గెలుస్తుందా ఓడుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే... తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉంటే కచ్చితంగా రెఫరెండంగా భావించేవారని అంటున్నారు. కానీ కేఈ మాత్రం రెఫరెండం అని చెప్పకపోవడం వారికి రెండో ఆలోచన కూడా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

వైసిపికి ఇది మరో ఆయుధం

వైసిపికి ఇది మరో ఆయుధం

కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ అస్త్రంగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఎన్నికలను రిఫరెండంగా చెప్పడం లేదంటే వారిలో ఓటమి భయం ఉన్నట్లేనని వైసిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశముందని అంటున్నారు. అలా చేస్తే టిడిపికి దెబ్బే అంటున్నారు.

అఖిలప్రియకు అక్కడక్కడా నిలదీత

అఖిలప్రియకు అక్కడక్కడా నిలదీత

ఇటీవల రోజాను పలువురు మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే. శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలకు గాను వారు అడ్డుకున్నారు. అదే సమయంలో అఖిలప్రియకు కూడా అక్కడక్కడా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి తదితర అంశాలపై కొందరు నిలదీస్తున్నారు.

అఖిలప్రియకు షాకిచ్చినట్లే!

అఖిలప్రియకు షాకిచ్చినట్లే!

ఇప్పుడు కేఈ వ్యాఖ్యలు టిడిపిని ఇరుకున పెట్టేవే అంటున్నారు. ఈ వ్యాఖ్యలు టిడిపికి, అలాగే వ్యక్తిగతంగా మంత్రి అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డిలకు షాకిచ్చేవే అంటున్నారు. ఈ వ్యాఖ్యలతో వైసిపి ప్రచారం నిర్వహించినా ఆశ్చర్యం లేదంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam leader and Deputy Chief Minister KE Krishna Murthy on Friday said that Nandyal bypoll are not referendum for TDP. TDP leader Somireddy Chandramohan Reddy counter to YSRCP chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...