టీడీపీ Vs వైసీపీ, గుడివాడలో టెన్షన్.. టెన్షన్ - కొడాలి నాని ఫ్లెక్సీ కలకలం..!!
గుడివాడలో మరోసారి రాజకీయ టెన్షన్ కనిపిస్తోంది. నియోజకవర్గ పరిధిలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఒకే సమయంలో పోటా పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసాయి. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ హిస్తున్న తొలి అడుగు లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రోజునే వైసీపీ సైతం బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ సమావేశ నిర్వహణకు సిద్దమైంది. కాగా, నగరంలో కొడాలి నాని పైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారుతోంది. దీంతో.. ఈ రెండు పార్టీల సమావేశాల వేళ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది.
కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ నేతలు ఈ రోజు నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్ణయించారు. ఇందు కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే రాము మద్దతు దారులు భారీగా ఏర్పాట్లు చేసారు. అదే సమయంలో కే కన్వెన్షన్ లో వైసీపీ నేతలు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో మరో కార్యక్రమం ఏర్పాటు చేసారు. అయితే, వైసీపీ నేతలు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

అందులో కుప్పంలో టీడీపీ గెలిస్తే తాను చంద్రబాబు బూట్లు తుడుస్తానని నాడు కొడాలి నాని చేసిన సవాల్ నిలబెట్టుకోవాలనే డిమాండ్ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పైన వైసీపీ నేతలు ఆగ్రహం తో ఉన్నారు. రెండు పార్టీల శ్రేణులు ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాగా, మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. పేర్ని నాని ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక.. గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో గుడివాడలో ఈ రెండు పార్టీల సమావేశాల వేళ ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా పోలీసులు పెద్ద సంఖ్య లో మొహరించారు. ఇప్పటికే రెండు పార్టీల శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రెండు పార్టీల సమావేశాలు పూర్తయ్యే వరకు బందోబస్తు కొనసాగించనున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications