బాధవద్దనే: బాలకృష్ణ, టీ డిప్యూటీ సీఎం రాజయ్య ప్రశంస
హైదరాబాద్: తన తల్లి క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధ మరెవరికి రాకూడదనే ఉద్దేశ్యంతో బసవతాకరం క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించామని హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం అన్నారు. రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కేబీఆర్ పార్క్ నుండి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వరకు నిర్వహించిన రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన నడకను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, నటి హేమ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తన తల్లి క్యాన్సర్ కారణంగా ఎంతో బాధపడ్డారని, ఆ బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశంతోనే క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించామన్నారు. ఈ ఆసుపత్రిని ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దుతామన్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను రాకుండా చేసుకోవచ్చునని అన్నారు.

బాలకృష్ణకు మంత్రి రాజయ్య అభినందనలు
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆసుపత్రి కోసం నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవలను అభినందించారు.
సినిమాల్లో డాక్టర్ పాత్రలు తక్కువగానే చేసిన బాలకృష్ణ నిజజీవితంలో మాత్రం డాక్టర్లా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
ఆయన ఓ ఆశయం కోసం పని చేస్తున్నారని కితాబిచ్చారు. క్యాన్సర్ రహిత రాష్ట్రం కోసం పాటుపడుతున్నారన్నారు. ఈ ఆసుపత్రి రాష్ట్రంలోనే ప్రముఖమైనదని, అత్యుత్తమ ప్రమాణాలతో, సేవా భావంతో నడిపిస్తున్నారన్నారు.
నెక్లెస్ రోడ్డులో ఎయిడ్స్ అవగాహన సదస్సు
నెక్లెస్ రోడ్డులో ఏఐఈఎన్ఈసీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఎయిడ్స్ అవగాహన వాక్ నిర్వహించారు. ఈ వాక్ పీపుల్స్ ప్లాజా నుండి జల విహార్ వరకు జరిగింది.
అనంతరం పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతీ యువకులు వృత్యాలు చేశారు. అవగాహన లేక ఎంతోమంది యువత ఎయిడ్స్ మహమ్మారి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన కోసమే తాము ఈ వాక్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications