టి సంబరాలకోసం: సిఎం క్యాంపాఫీస్ వద్ద ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భానం, తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రెండో తేదీ (సోమవారం) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నందున దాని చుట్టుపక్కల వాహనాల రాకపోకలను బంద్ చేస్తున్నారు.
ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వేడుకలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి తెలంగాణవాదులు, తెరాస నేతలు భారీ సంఖ్యలో తరలి రావడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
దీని దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల నుంచి నగరానికి అనుసంధానంగా ఉన్న మార్గాలలో పోలీసులు పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేశారు. మొత్తం 16 ప్రదేశాలను వాహనాల నిలుపుదలకు కేటాయించారు. మరోపక్క అన్ని మార్గాల్లోనూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బీఎస్ఎఫ్ బలగాలను బందోబస్తుకు దింపారు.
మళ్లింపు ఇలా.. మనొప్ప ఐలాండ్‌నుంచి ఖైరతాబాద్‌లోని వివి విగ్రహం వరకు ఉన్న రోడ్డును మూసివేస్తారు. ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ నుంచి ఎస్పీ రోడ్డు మీదుగా బేగంపేట వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాల ను పాట్నీ, ఆర్పీ రోడ్డు, పాట్నీ, ప్యారడైజ్, స్వీకార్ ఉపకార్ టీవోలీ, బాలంరాయి - సీటీవో వైపు మళ్లిస్తారు. సీటీవో క్రాస్‌రోడ్స్ నుంచి పెరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వాహనాలను బాలంరాయి - టివోలీ - స్వీకార్ ఉపకార్, ఎస్‌బీహెచ్, ప్యారడైజ్ - ఎస్డీ రోడ్డు - పాట్నీ - క్లాక్ టవర్ - సంగీత్ జంక్షన్ మీదుగా పంపుతారు. టివోలీ నుంచి ప్లాజా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను బాలంరాయి - సీటీవో మార్గాల్లోకి మళ్లిస్తారు. - పార్క్‌లేన్ క్రాస్‌రోడ్స్ నుంచి ప్లాజా వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ - పాట్నీ మార్గాల్లోకి పంపుతారు. వైఎంసీఏ, సీటీవో ఫ్లైఓవర్ల మీదుగా ఎటువంటి ట్రాఫిక్‌ను అనుమతించరు.
పార్కింగ్ ప్రదేశాలు.. నల్గొండ జిల్లా నుంచి ఉప్పల్, తార్నాక మీదుగా వచ్చే వాహనాలను సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం పక్కన ఉన్న రైల్వే రిక్రియేషన్ క్లబ్, బేగంపేటలోని వెస్లీ కళాశాలలో, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌లోని సగభాగం, నిజామాబాద్ వైపు నుంచి ఎన్‌హెచ్ 7 (మేడ్చల్), ఎన్‌హె చ్ 7(బాలానగర్) మీదుగా వచ్చే వాహనాలను మస్తాస్ కేఫ్ వద్ద గల దోబీఘాట్, బాలంరాయిలోని లారీల అడ్డా, టివోలీ వద్ద గల మిలీనియం గార్డెన్, పెరల్ గార్డెన్‌లో, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల నుంచి రాజీవ్ రహదారిపై నుంచి వచ్చే వాహనాలను లంబా రోడ్డు, నార్ని ఎస్టేట్స్ ఎదురుగా గల కేజేఆర్ గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్ ముందు భాగం, స్వీకార్ ఉపకార్ వద్ద గల సెంటినరీ ఉన్నత పాఠశాలలో, సిద్దిపేట, వరంగల్ (చేర్యాల), మహబూబ్‌నగర్‌లోని సగభాగం జిల్లాల నుంచి మెహదీపట్నం వైపుగా వచ్చే వాహనాలను సికింద్రాబాద్‌లోని సీటీవో వద్ద గల పీజీ కళాశాల, బేగంపేట ఎయిర్‌పోర్డు, ఎయిర్ కార్గో వద్ద, రంగారెడ్డి జిల్లా నుంచి మెహదీపట్నం, పంజాగుట్ట మార్గాల్లో వచ్చే వాహనాలను సికింద్రాబాద్‌లోని పీజీ కళాశాల, బేగంపేట ఎయిర్‌పోర్టులో, - హైదరాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి మల్కాజిగిరి, కుషాయిగూడ, అడ్డగుట్ట మార్గాల్లో వచ్చే వాహనాలను లంబా రోడ్డులో నిలుపుదల చేయాలి.

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం.

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం. పర్యవేక్షిస్తున్న అధికారులు.

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం. ఏర్పాట్లలో సచివాలయం.

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం. ఏర్పాట్లలో సచివాలయం.

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం. జెసిబితో రోడ్డు నునుపు చేస్తూ...

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం. జెసిబితో రోడ్డు నునుపు చేస్తూ...

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం. జెసిబితో రోడ్డు నునుపు చేస్తూ...

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం.

డెకరేషన్
29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సచివాలయం వద్ద గేటు వద్ద డెకరేషన్ చేస్తున్న దృశ్యం.

బారీకేడ్లు
తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బేగంపేటలోని సిఎం క్యాంపాఫీస్ వద్ద బారీకేడ్లు తొలగించిన దృశ్యం.

Click it and Unblock the Notifications