నటుడు చలపతిరావు కన్నుమూత..!!
తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. చలపతిరావు (78) కన్నుమూసారు. ఈ తెల్లవారు జామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. చలపతిరావుకు ఒక కమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1944, మే 8న క్రిష్ఱా జిల్లా బలిపర్రులో చలపతిరావు జన్మించారు. దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నా చలపతి రావు ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
కుమారుడు రవి బాబు సినీ పరిశ్రమలోనే ఉన్నారు. నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు. చలపతిరావు నటుడిగా, విలన్ గా, కామెడీ పాత్రలు పోషించారు. 1966లో గూఢచారి సినిమాతో ఆయన తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. 2022 లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దూరమయ్యారు.

క్రిష్ణంరాజు, క్రిష్ణ, కైకాల సత్యానారాయణ ఈ ఏడాదిలోనే కన్నుమూసారు. కైకాల అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజునే ఇప్పుడు చలపతి రావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చలపతి రావు నివాసానికి సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications