టికెట్ల రేట్లు పెంచమని అడుగుతారా...? వరదలపై స్పందించని తెలుగు హీరోలు

భారీ వర్షాలు,వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలకుతలం చేశాయి. ముఖ్యంగా ఏపీపై ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.రెండ్రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. భారీ వర్షాలు కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి.రెండు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Telugu star heroes did not respond to floods

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి తెలుగు హీరోలెవరూ కూడా ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచింది లేదు. ఇండియాలో మా అంత గొప్ప హీరోలు లేరని చెప్పుకునే తెలుగు స్టార్స్.. కష్టాల్లో ఉన్న ప్రజలకు తాము ఉన్నామని కనీస భరోసా కూడా ఇవ్వలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు దేవుళ్లతో సమానం చెప్పే హీరోలెవ్వరూ ప్రజలకు అండగా నిలిచింది లేదు. అదే తమిళనాడులో భారీ వరదలు వచ్చినప్పుడు అక్కడ హీరోలు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు సాయం చేశారు.మరికొందరు ఆర్ధికంగా ప్రజలను ఆదుకున్నారు.

గత శనివారం నుంచి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. అయినప్పటికి హీరోలు ముందుకు రాని పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరూ పెద్దగా స్పందించింది లేదు.అదే తమ సినిమాలు విడుదలవుతుంటే మాత్రం టికెట్ల రేట్లు పెంచాలని ప్రభుత్వాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తారు. ప్రజల డబ్బును పారితోషకంగా తీసుకునే హీరోలు, అదే ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రం స్పందించకపోవడం నిజంగా బాధాకారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+