శ్రీలీల వెంట పడుతున్న స్టార్ ప్రొడ్యూసర్?

పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన కథానాయిక శ్రీలీల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. స్టార్ స్టేటస్ పొందిన ఈ భామ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్టులున్నాయి. ఆమె డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజారనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తోంది.

ఇలాంటి యంగ్ హీరోయిన్ కు తెలుగు పరిశ్రమలోని ఒక స్టార్ ప్రొడ్యూసర్ తో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకొని వరుస అవకాశాలు కొట్టేస్తున్న శ్రీలీల ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. అలాంటి శ్రీలీలను ఆ ప్రొడ్యూసర్ వేధిస్తున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

sreeleela

ఆయన పేరు బయటకు రావడంలేదుకానీ వయసు 50 సంవత్సరాలపైనే ఉంటుందంట. శ్రీలీలకు ఫోన్ చేసిన ప్రతిసారీ.. తన కోరిక తీర్చితే ఇండస్ట్రీలో ఇంకా పెద్ద కథానాయికవవుతావని, వరుస అవకాశాలు ఇంటి తలుపు తడతాయని, ఇండస్ట్రీ ఏలే స్థాయికి చేరుకుంటావంటూ టార్చర్ పెడుతున్నాడంట. వాటికి శ్రీలీల మాత్రం ఓకే చెప్పడంలేదంట. ప్రతిసారీ ఆమె ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్లి కళ్లతో సైగలు చేస్తూ చాలా టార్చర్ చేస్తున్నాడని తెలుస్తోంది.

శ్రీలీలను అంతగా టార్చర్ పెడుతున్న ప్రొడ్యూసర్ ఎవరా అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఆయన ఒక బడా ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. వేధింపులు ఇలానే కొనసాగితే నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయాలనే యోచనలో శ్రీలీల ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రకరకాల పేర్లు వినపడుతున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఆయన పేరును కనిపెట్టలేకపోతున్నారు. నాలుగు రోజులు ఓపిక పడితే ఆ పేరు బయటకు తెలుస్తుంది కదా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+