బెంగళూరు రేవ్ పార్టీలో కారు సీజ్, ఆంధ్రా పొలిటికల్ లీడర్ కారు ఓనర్, ఏ పార్టీ అంటే ?
బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ తాలుకాలోని హుస్కూరు సమీపంలోని జేఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం గురించి రోజుకొక వ్యవహారం బయటకు వస్తోంది. రేవ్ పార్టీ జరగడంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత రేవ్ పార్టీ కేసును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించడంతో కథ రసవత్తరంగా మారుతోంది.
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసులకు చిక్కిన వాళ్లందరి రక్త నమూనాలు స్వీకరించిన పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించారు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఆ ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న కొన్ని మొబైల్ ఫోన్లు సీజ్ చేసి వాటిలోని ఫోన్ నెంబర్లు పరిశీలిస్తున్నారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఫార్చూనర్ కారు ఎవరిది ? అనే విషయంపై బెంగళూరు సీసీబీ పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఏపీ 39 హెచ్ 0002 నెంబర్ ఫార్యూనర్ కారు ఓనర్ ఎవరు అని పోలీసులు ఆరా తీస్తుంటే ఆ కారు టీడీపీ నాయకుడిది అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో పోలీసులు సీజ్ చేసిన కారు వైసీపీ నాయకుడిది అంటూ మొదట్లో టీడీపీ ఆరోపించింది. అయితే ఇప్పుడు ఆ కారు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడిది అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
త్యాగరాజులు నాయుడి పేరిట ఉన్న పార్చూనర్ కారు రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో ఎందుకు ఉంది ? అంటూ బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. తన కారును 9 నెలల క్రితమే వేరే వ్యక్తికి విక్రయించానని, ఆ కారును ఆయన పేరుతో ఇంకా రిజిస్టర్ చేయించుకోలేదని, తన పేరు మీద కారు ఉందని త్యాగరాజులు నాయకుడు డ్రామా ఆడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీకి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులకు లింక్ ఉంది వైసీపీ నాయకుల ఆరోపిస్తున్నారు
అయితే త్యాగరాజులు నాయుడు పేరు మీద ఉన్న పార్ఫూనర్ కారు చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు ఉపయోగించారని, తరువాత రేవ్ పార్టీలో అడ్డంగా చిక్కిపోయారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు పక్కాక్లారిటీ ఇచ్చే వరకు ఎవరిమాట నమ్మడానికి వీలులేదని కొందరు అంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు జిల్లా పేరు నానడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications