తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం, ఎన్ని వేల కోట్లు అంటే !

ఇటీవల కురిసిన భారీ వర్షాల దెబ్బకు తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాలలో వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ తక్షణం రూ. 5858. 60 కోట్లు విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ పండ్ అడ్వాన్స్ నుంచి దేశంలోని 14 రాష్ట్రాలకు హోం శాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రూ. 1,036 కోట్లు, తెలంగాణకు రూ. 416. 80 కోట్ల వరదసాయం కింద నిధులు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించిన విషయం తెలిసిందే.

The central government has announced flood aid to the states of Andhra Pradesh and Telangana

కేంద్ర బృందాలు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర హోంశాఖ తక్షణ సాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాలు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాలకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంగళవారం కేంద్ర హోం శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు వరదల కారణంగా కొన్ని జిల్లాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే.

The central government has announced flood aid to the states of Andhra Pradesh and Telangana

ముఖ్యంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు వరద సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాలలో వరదల దెబ్బకి ప్రజలు నా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణకి వరద సహాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల తో పాటు పశ్చిమ బెంగాల్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు మంగళవారం కేంద్ర హోం శాఖ వరద సహాయం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+