దేవాదాయశాఖ మంత్రులకు రాజకీయ భవిష్యత్తు క్లోజ్..ఆధారాలివిగో..!
దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎన్నికల్లో ఓడిపోతారని.. వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ప్రచారం ఏపీ రాజకీయాలను సెంటిమెంట్ వెంటాడతుంది. ముహూర్తాల నుంచి శాఖల వరకు అనేక అంశాల్లో సెంటిమెంట్ ముడి పడి ఉంది. తాజాగా చంద్రబాబు తన కేబినెట్లోని మంత్రలకు శాఖలు కేటాయించారు. సీనియర్ మంత్రి అనంకు అనూహ్యంగా దేవాదాయ శాఖ అప్పగించారు. కానీ, ఈ శాఖ బాధ్యతలు నిర్వహించాలంటే టెన్షన్ తప్పదు. ఈ శాఖ నిర్వహించిన మంత్రులను ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. మరి ఆనం ఏం చేయబోతున్నారు.
సెంటిమెంట్ గా
ఏపీలో దేవాదాయ శాఖ మంత్రులుగా పని చేసిన ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రి ఆ తరువాత మళ్లీ గెలవరనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ సెంటిమెంట్ దాదాపుగా ప్రతీ దేవాదాయ శాఖ మంత్రి విషయంలోనూ నిజమైంది. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన పైడికొండల మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసారు. నాడు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన మంత్రి పదవి కోల్పోయారు.

గతంలో ఇలా
ఇక, జగన్ ప్రభుత్వంలో తొలి విడత దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పని చేసారు. ఆ తరువాత మంత్రి పదవి కోల్పోయారు. తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా తాడేపల్లిగూడెంకు చెందిన కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొట్టు సత్యనారాయణ పర్యవేక్షించారు. తాజా ఎన్నికల్లో జనసేన అభ్యర్ది బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓటమికి గురయ్యారు. గత పదేళ్ల కాలంలో చేసిన దేవాదాయ శాఖ మంత్రులు రాజకీయంగా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
మరోసారి చర్చ
తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయ శాఖ కేటాయించారు. ఆనం గతంలో పలు శాఖలకు మంత్రిగా పని చేసారు. ఈ సారి ఆనంకు రెవిన్యూ వంటి శాఖ దక్కుతుందని భావించారు. అయితే అనూహ్యంగా దేవాదాయ శాఖ దక్కింది. గత కొన్నేళ్లుగా దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రులు తరువాతి కాలంలో రాజకీయంగా నష్టపోయిన సందర్బాలు ఇప్పుడు ఆయన మద్దతు దారులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే టెన్షన్ తో కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications