కొల్లు రవీంద్రకు గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు, అమెరికా పర్యటన రూట్ క్లియర్ !
టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి కొల్లు రవీంద్ర పాస్ పోర్టు ప్రక్రియ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొల్లు రవీంద్ర పాస్ పోర్టుకు సంబంధించి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
క్రిమినల్ కేసులకు సంబంధం లేకుండా మంత్రి కొల్లు రవీంద్రకు పాస్ పోర్టు మంజూరు చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వల ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు అనంతరం విచారణలో రెండు వారాలకు వాయిదా వేసింది. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో తన పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యకపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఈనెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న మైన్ ఎక్స్పో కార్యక్రమంలో తాను పాల్గొనాల్సి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర హైకోర్టుకు చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర తరపున అనే న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయనే కారణంతో పాస్ పోర్టు రెన్యువల్ చెయ్యడాన్ని తిరస్కరించరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను మంత్రి కొల్లు రవీంద్ర న్యాయవాది హైకోర్టుకు చెప్పారు.
వాదనలు విన్న హైకోర్టు మంత్రి కొల్లు రవీంద్రకు పాస్ పోర్టు పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటనకు వెళ్లడానికి లైన్ క్లియర్ అవుతోందని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో తన పైన అక్రమంగా కేసులు పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర అనేక సందర్భాల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన కొల్లు రవీంద్ర చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. మంత్రి హోదాలో మంత్రి కొల్లు రవీంద్ర ఇదే నెల చివరి వారంలో అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications