Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

P అంటే పవన్ కల్యాణ్, P అంటే పిఠాపురం, 100 శాతంతో జనసేన పాస్, రికార్డు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వందకు వందశాతం మార్కులు కొట్టేశాడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రావడం ఆలస్యం అయినా వచ్చేది పక్కా అంటూ పవన్ కల్యాణ్ నిజజీవితంలో కూడా నిరూపించుకున్నాడు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 21 మంది గెలవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చరిత్ర తిరగరాశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ను కొందరు వైసీపీ నాయకులు అనరాని మాటలు అన్నారు. పవన్ కల్యాణ్ మనోధైర్యదెబ్బ తియ్యడానికి, అతను కుంగిపోయేలా వ్యక్తిగత విమర్శలు చేశారు. సింగల్ గా పోటీ చెయ్యడానికి సత్తాలేని తోకపార్టీ జనసేన కేవలం 21 సీట్లకే పరిమితం అయిపోయిందని వైఎస్ జగన్ తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడారు.

The Jana Sena has set a record by winning 21 MLAs out of the 21 seats it contested

జనసేన ఎన్నిసీట్లలో పోటీ చేస్తోంది అనేదికాదు ముఖ్యం, గెలిచే స్థానాల్లోనే మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పట్లోనే ప్రకటించారు. మొదట 24 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ తరువాత కూటమి అభ్యర్థుల కోసం మూడు సీట్లు త్యాగం చేసి కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనే జనసేన నాయకులు పోటీ చేసేలా చూసుకున్నారు. ఆ రోజు పవన్ మూడు సీట్లు త్యాగం చేసినందుకు ఈ రోజు నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి.

పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 21 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో జనసేన నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. ఇక పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో అయితే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. P అంటే పవన్ కల్యాణ్, P అంటే పవన్ కల్యాణ్ అని జనసేన ట్రెండ్ సెట్ చేసింది. జనసేన దెబ్బకు వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యింది.

తెలుగుదేశం, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా వైసీపీ నాయకులు చేసిన విమర్శల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు, ఇక పవన్ కల్యాణ్ కు ఉచిత సలహాలు ఇచ్చిన నాయకులకు ఏమాత్రం కొదవలేదు. ఎవరు ఎన్నిచేసినా, ఎవరు ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా, వ్యక్తిగత విమర్శలు చేసినా ఏమాత్రం పట్టించుకోని పవన్ కల్యాణ్ కూటమి ఓట్లు చీలిపోకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి వారిని ఒక్కటి చేసి ఈరోజు ఆయన అనుకున్నది సాధించారని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+