ఏకం అవుతున్న పెద్దిరెడ్డి వ్యతిరేక వర్గం, చంద్రబాబు స్కెచ్ తో ఆల్ ఇన్ వన్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఏకమవుతున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బీసీవై పార్టీ అభ్యర్థి, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు అందరూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య స్వర్ణలత పేరుతో ఉన్న 142 ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ ప్రస్తావించలేదని బీసీవై పార్టీ అధ్యక్షుడు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరికీ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీకి ఈ పిటిషన్ విచారణ వాయిదాపడింది. కోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత పుంగనూరు నియోజక వర్గంలో అత్యధికంగా ఓట్లు సంపాదించిన టీడీపీ నాయకుడు చల్లా రామచంద్రా రెడ్డి అలియాస్ చల్లా బాబు అనుచరులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేటు పడితే చల్లా రామచంద్రా రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుందని పుంగనూరులోని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. అయితే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. పుంగనూరులో ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గీయుల పెత్తనాన్ని దెబ్బతీస్తున్న టీడీపీ నాయకులు ఆ నియోజక వర్గంలో పట్టుసాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే పుంగనూరు నియోజక వర్గం కూడా ఉన్న విషయం తెలిసిందే. దశాభ్దాల కాలంనుంచి రాజకీయ ప్రత్యర్థులు అయిన నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజకీయంగా ఇప్పటికీ పోటీ పడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు సార్లు సీఎం అయ్యారు. అయితే మంత్రి పదవితోనే సరిపెట్టుకుంటున్న పెద్దిరెడ్డికి మాత్రం సీఎంగా ఒక్క చాన్స్ కూడా రాలేదు. మొత్తం మీద రెండు నెలల నుంచి పెద్దిరెడ్డి వర్గంలో కొంచెం టెన్షన్ మొదలైందని సమాచారం.












Click it and Unblock the Notifications