తాడిపత్రిలోకి ఎవరు ఆపుతారు - పెద్దారెడ్డి ఎంట్రీకి సుప్రీంకోర్టు ఆదేశాలు..!!
తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దారెడ్డి కి తాడిపత్రిలోకి ప్రవేశం దక్కలేదు. 15 నెలల కాలం గా ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లలేకపోతున్నారు. ఇటీవల ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు రావడంతో మరోసారి తాడిపత్రి వెళ్లాలని ప్రయత్నించారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిరిగి హైకోర్టు డివిజన్ బెంచ్ పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించింది. దీంతో, సుప్రీంకు వెళ్లగా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది.
వైసీపీ నేత పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 15 నెలల కాలం గా పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి రావటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించటం లేదు. కాగా, ఇదే అంశం పైన పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోలీసులు పెద్దారెడ్డిని భద్రతతో ఆయన ఇంటికి చేర్చాలని ఆదేశాలు వెలువడాయి. అవసరమైతే అదనపు ఫోర్స్ వాడుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు మధ్యలోనే ఆపి తిరిగి పంపేశారు. కాగా, పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్.

ఇక, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు పై పెద్దారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాడిపత్రి వెళ్తే ఎవరు ఆపుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. పెద్దారెడ్డి భద్రతకు అవసరమైన అన్ని ఖర్చులు తామే భరిస్తామని పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఈ విచారణ ముగించింది. దీంతో, ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్తారా.. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications