Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాట్సప్ ద్వారా కనకదుర్గమ్మ దర్శనం టికెట్లూ: నంబర్ తెలుసు కదా!

Kanakadurgamma: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వాట్సప్ గవర్నెన్స్‌‌ను ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.

వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టయింది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ తెర తీసింది. ఈ క్రమంలో కిందట నెల 18వ తేదీన వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది.

The tickets of Vijayawada Kanakadurga temple is issued through WhatsApp to the Devotees

దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తోన్నాయి ప్రఖ్యాత ఆలయాలు. తిరుమలలో వసతిగదుల కేటాయింపు వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి వాట్సప్ ద్వారా సమాచారం ఇచ్చే ప్రక్రియను టీటీడీ త్వరలో చేపట్టబోతోంది. ఆన్‌లైన్ ద్వారా గదులను బుక్ చేసుకున్న వారికి వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందజేయడానికి కసరత్తు చేపట్టింది.

వసతి గదులు కేటాయింపు పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్ వివరాలను వాట్సప్ ద్వారా చేరవేసేలా మార్పులుచేర్పులు చేపట్టనుంది. భక్తులకు మరింత నాణ్యమైన సేవలను అందించే క్రమంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వారు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది.

పాలనాపరమైన సంస్కరణలను చేపట్టడం వల్ల క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తోంది. తిరుమల, తిరుపతిల్లో గల వసతి గదుల బుకింగ్ భారీగా ఉంటోంది. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

అదే సమయంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కూడా వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం టికెట్లను వాట్సప్ ద్వారా భక్తులకు అందజేయాలని నిర్ణయించింది. అమ్మవారి దర్శనంతో పాటు, ఆర్జిత సేవల టికెట్లను కూడా వాట్సప్ ద్వారానే అందించనుంది. లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమం, ప్రదక్షిణ సేవ, ఏకాంత సేవ.. వంటి ఆర్జిత సేవలు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటోన్న విషయం తెలిసిందే.

వాటిని పొందడానకి వాట్సప్ చేయాల్సిన నంబర్ 95523 00009. దీనికి మెసేజ్‌ను పంపించడం ద్వారా భక్తులు తమకు అవసరమైన దర్శనం లేదా ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు సంబంధించిన టికెట్లను వాట్సాప్‌ ద్వారానే పొందడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల దళారీ వ్యవస్థకు చెక్ పెట్టినట్టవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+