వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల మొబైల్ హుండీలో పాత దొంగ చోరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని మొబైల్‌ హుండీలో చోరీ జరిగింది. సుధాకర్‌నాయుడు అనే వ్యక్తి మొబైల్‌ హుండీ నుంచి రూ.17,300 నగదును దొంగిలించాడు. తిరుమలలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన హుండీతో పాటు రెండు మొబైట్‌ హుండీలను టీటీడీ ఏర్పాటు చేసింది.

సోమవారం తెల్లవారుజామున పాత నేరస్తుడైన సుధాకర్‌నాయుడు మొబైల్‌ హుండీ నుంచి నగదును తస్కరించాడు. ఈ వ్యవహారాన్ని సీసీ టీవీల్లో గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

Theft in tirumala Mobile Hundi

వెంటనే విజిలెన్స్‌ సిబ్బంది సుధాకర్‌నాయుడును అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్న వెంటనే సుధాకర్‌ తన వెంట తెచ్చుకున్న వైట్నర్‌ను తాగడంతో ప్రస్తుతం అతడు మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

తిరుపతిలో దోపిడీ దొంగల బీభత్సం

తిరుపతిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రగిరి విజయనగర్ కాలనీలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. మారణాయుధాలతో దాడి చేసి నగలు అపహరించారు. దొంగల దాడిలో మునిరాజు, సునిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఉదయం వీరి మూలుగులు విన్న స్థానికులు తలుపులు తెరిచి బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

English summary
Habitual offender Sudhakar Naidu has stolen Rs 17,300 from Sri venkateswara Swami Mobile hundi at Tirumala in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X