Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో చూపించిన పవన్, ఆరోజు వదిలేసి ఉంటే ఈ రోజు ?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సీఎంగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు పలువురు నాయకులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సగర్వంగా కొణిదల పవన్ కల్యాణ అనే నేను అని మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత దెబ్బకు ఇప్పుడు వైసీపీకి చెందిన కొందరు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కల్యాణ్ అని జనసేన చీఫ్ నిరూపించుకున్నాడు. ఆరోజు రచయిత, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ ముహూర్తానా పవన్ కల్యాణ్ కోసం ఈ డైలాగ్ రాశాడో కాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన రాజకీయ జీవితంలో కచ్చితంగా ఆ డైలాగ్ కు న్యాయం చేశాడని ఆయన సన్నిహితులు, రాజకీయ నాయకులతో పాటు పవర్ స్టార్ అభిమానులు, ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అంటున్నారు.

There are many reasons why Pawan Kalyan became the Minister of Andhra Pradesh

జనసేన పార్టీ పెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. తరువాత రాజకీయ విభేదాలతో టీడీపీకి దూరం అయిన పవన్ కల్యాణ్ 2019లో జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. తాను బలైన టీడీపీ, వైసీపీని ఢీకొడుతున్నానని తెలిసినా పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సినిమాల్లో సంపాధించిన వందల కోట్ల రూపాయాల డబ్బు రాజకీయాల కోసం ఖర్చు చేశారు.

ఆ సందర్బంలో పవన్ కల్యాణ్ ఆయన పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లో ఓడిపోయారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్క ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరినా పవన్ కల్యాణ్ ధైర్యంగా నిలబడ్డాడు, తరువాత వైసీపీ ప్రభుత్వం జనసేన కార్యకర్తల మీద దాడులు చేసిందని, తప్పుడు కేసులు పెడుతోందని మండిపడిన పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. జనసైనికులు, వీర మహిళలను తాను నమ్ముకున్నానని, వారికి అన్యాయం జరిగితే సహించనని వైసీపీ ప్రభుత్వానికి నేరుగా సంకేతాలు ఇచ్చిన పవన్ కల్యాణ్ అప్పటి జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేశారు.

రానురాను పవన్ కల్యాణ్ కు ఇమేజ్ పెరగడంతో వైసీపీలోని నాయకులు ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి బహిరంగంగా ఆయన్ను దూషించడం మొదలుపెట్టారు. అప్పటి వైసీపీ మంత్రుల ఆరోపణలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇస్తూ వచ్చారు. అయితే ఏ రోజు అయితే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ముగ్గురు పెళ్లాల గురించి మాట్లాడారో ఆ రోజు కూడా పవన్ కల్యాణ్ సహనం కోల్పోలేదు. నాకు ముగ్గురు భార్యలు అన్న మాట వాస్తవం, నాకు నాలుగో పెళ్లామ్ లేదని, నా నాలుగో పెళ్లామ్ జగన్ అని పవన్ కల్యాణ్ కూడా ఎదురుదాడికి దిగారు.

నవ్యాంధ్రప్రదేశ్ కు మంచి నాయకుడు కావాలని అనుకున్న పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెళ్లి జనసైనికులను ఏకం చెయ్యడానికి సిద్దం అయ్యారు, అనుకున్నట్లే జరిగింది. అయితే ఏ రోజు అయితే జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించిందో ఆ రోజు వైసీపీ నాయకుల తలరాతలు మారడం మొదలైనాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్ అదే జైలు బయటకు వచ్చి తాను టీడీపీతో పొత్తుపెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరి పవన్ కల్యాణ్ నిరూపించారు. జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి కేంద్రంలోని బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిగా ఎర్పడటానికి సూత్రధారి, పాత్రధారి అన్ని పవన్ కల్యాణ్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, పురందేశ్వరితో మాట్లాడి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ హైకమాండ్ ను ఒప్పించారు.

There are many reasons why Pawan Kalyan became the Minister of Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా పవన్ కల్యాణ్ పావులు కదిపారు. ఇదే సమయంలో జగన్ తో పాటు అప్పటి వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్ ను వ్యకిగత దూషణలతో మాట్లాడిన పవన్ కల్యాణ్ కుంగిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసిన పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిక ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా పవన్ కల్యాణ్ కుంగిపోలేదు.

పవన్ కల్యాణ్ తీసుకున్న జాగ్రత్తలతో జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకును ఏకం చేసిన పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. ఆ రోజు పవన్ కల్యాణ్ ను ఎందుకు రెచ్చగొట్టామురా దేవుడా అని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు. పవన్ కల్యాణ్ అతనిపాటికి అతను సినిమాలు తీసుకుంటుంటే రెచ్చగొట్టిన వైసీపీ నాయకులు ఈరోజు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద రాజకీయాల్లో ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అని పవన్ కల్యాణ్ అక్షరాల నిరూపించారని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+