చౌదరిని మాట్లాడ్తున్నా, ఏం చేయాలో చేస్తా: 'టీ న్యూస్'కు బెదిరింపు కాల్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చెందిన టీ న్యూస్‌కు సోమవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. 9440005760 అనే సెల్ నెంబర్ నుండి బెదిరింపు కాల్ వచ్చినట్లుగా చెబుతున్నారు.
టీ న్యూస్ ఛానల్‌ను ఏం చేయాలో అది చేస్తామని బెదిరించారని తెలుస్తోంది. తాను చౌదరిని మాట్లాడుతున్నానని, ఏం చేయాలో అది చేస్తానని బెదిరించారని టీ న్యూస్ యాజమాన్యం చెప్పింది.

అయితే, ఇది ఎవరైనా పోకిరీలు చేశారా లేక తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీకి మరిన్ని ఇక్కట్లు తెచ్చేందుకు ఉద్దేశ్యపూర్వకంగా చేశారా లేక నిజమైన బెదిరింపులా తెలియాల్సి ఉంది. రేవంత్ రెడ్డి వ్యవహారం, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టేపుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో మాట్లాడిన ఆడియో టేపులను టీ న్యూస్ ఆదివారం రాత్రి ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ పైన జరిగిన తెలంగాణ రాష్ట్ర వేడుకల ప్రసారాలను నిలిపివేసి టీ న్యూస్ చానల్ ఆడియో టేపులను ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications