ఎన్నో అనుమానాలు: ఈవినింగ్ వాక్ వెళ్లిన యువతికి నిప్పంటించారు, మృతి

Subscribe to Oneindia Telugu
ఈవినింగ్ వాక్ వెళ్లిన యువతికి నిప్పంటించారు, మృతి

విజయనగరం: జిల్లా కేంద్రం శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈవినింగ్ వాక్‌కు వెళ్లిన 25ఏళ్ల యువతిపై గుర్తు తెలియని దుండగలు పెట్రోలు పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు.. బాధితురాలిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
కాగా, చికిత్స పొందుతూ ఆ యువతి శనివారం ప్రాణాలు వదిలింది.

ఈవినింగ్ వాక్ వెళ్లిన యువతి

ఈవినింగ్ వాక్ వెళ్లిన యువతి

బాధితురాలి బంధువుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలయ్యపేటకు చెందిన ఎం.అశ్విని(25) స్థానిక సీతం కళాశాలలో బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. అయితే శుక్రవారం సాయంత్రం ద్వారపూడి సమీపంలోని ఓ లేఅవుట్‌ ప్రాంతంలోకి వాకింగ్‌కి వెళ్లింది.

 పేరు అడిగి పెట్రోల్ పోసి నిప్పంటించారు..

పేరు అడిగి పెట్రోల్ పోసి నిప్పంటించారు..

చీకటి పడే సమయంలో ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమె పేరు అడిగారు. ఆమె తనపేరు చెప్పగానే ఆమెను పట్టుకొని పెట్రోలు కలిపిన కిరోసిన్‌ ఆమెపై పోసి నిప్పు అంటించి పరారయ్యారు. జన సంచారం అంతగా లేని ప్రాంతం కావడంతో ఆమెను ఎవరు గమనించలేదు. దీంతో ఆమె 95శాతం కాలిపోయింది.

పూర్తిగా కాలిపోవడంతో.. చీమలు పట్టాయి..

పూర్తిగా కాలిపోవడంతో.. చీమలు పట్టాయి..

కొంత సమయానికి అటుగా వెళ్లిన స్థానికులు ఆమెను గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ఉన్న ఒక ప్రైవేట్‌ అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లారు. ఆ సమయంలో యువతి ఒంటిపైన ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోయి దేహంపై చీమలు పట్టిన స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 కన్నుమూసిన అశ్విని

కన్నుమూసిన అశ్విని

సమాచారం అందుకున్న డీఎస్పీ ఏవీ రమణ ఆసుపత్రికి చేరుకొని బాధితురాలిని, ఆమె బంధువుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. 95శాతం గాయాలతో చికిత్స పొందుతూ అశ్విని శనివారం ప్రాణాలు వదిలింది. కాగా, జిల్లా కేంద్రంలో పోలయ్య పేటలో నివాసం ఉంటున్న తండ్రి ఎం.సూర్యారాజు, తల్లి సుజాతల పెద్ద కుమార్తె అశ్విని. బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్న ఈ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మూడు నెలల కిందట కేఎల్‌పురం నుంచి వీరు పోలయ్యపేటకు తరలివచ్చారు. తండ్రి సూర్యరాజు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మాయికి సంబంధించిన వివరాలు బయటకు చెప్పేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. రోజూ అశ్వినితో కలిసి రెండో కుమార్తె వాకింగ్‌కు వెళ్తుందని, అయితే ఆమె ఆరోగ్యం బాగోకపోవడంతో వెళ్లలేకపోయిందని తల్లి సుజాత కన్నీటి పర్యాంతమైంది.

 అనేక అనుమానాలు..

అనేక అనుమానాలు..

శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం చేసి హత్యకు తెగబడ్డారా..? లేక ఇతర కారణాలతో హత్య చేసేందుకు ప్రయత్నించారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. హత్య కేసులో తెలిసిన వ్యక్తుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా ప్రాంతంలో స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఇలా జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మేజిస్ట్రేట్ వచ్చి బాధితురాలితో మాట్లాడి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some thugs on Friday evening sets a girl on fire, ends life, in vizianagaram district.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి