Timesnow-etg survey-2024 LS Polls: ఏపీలో జగన్ పార్టీ హవా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ
న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలదే హవా కొనసాగుతుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని టౌమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్‌కు షాక్
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీకి 8-10, బీజేపీ 4 - 6 సీట్లు దక్కించుకుంటాయని తెలిపింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి 2-4 సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేసింది.

ఏపీలో వైసీపీ హవా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైసీపీదే హవా అని తాజా సర్వే తేల్చింది. టౌమ్స్ నౌ-ఈటీజీ సర్వేలో ఏపీలోని మొత్తం 25 సీట్లకు గానూ వైయస్సార్సీపీ 21 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఇక, టీడీపీ-జనసేన కూటమికి 3-4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2 శాతం, ఇతరులకు 4 శాతం ఓటింగ్ నమోదు కావచ్చని తెలిపింది.
అయితే, టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు కాని విషయం తెలిసిందే. కాగా, 2023 డిసెంబర్ 13వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 3 లక్షల 20వేల మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85 శాతం కాగా, ఫోన్ల ద్వారా మరో 15 శాతం అభిప్రాయాలను సేకరించింది.
దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చంటే?
కేరళలో...:
ఎన్డీయే: 0-1, ఇండియా కూటమి: 18-20, ఇతరులు : 0
కర్ణాటకలో...:
బీజేపీ: 21-23, కాంగ్రెస్: 4-6, జేడీఎస్: 1-2, ఇతరులు: 0
తమిళనాడులో...:
ఎన్డీయే: 2-6, ఇండియా కూటమి: 29-35, అన్నాడీఎంకే: 1-3, ఇతరులు: 0-2
మహారాష్ట్రలో...:
ఎన్డీయే: 34-38, ఇండియా కూటమి: 9-13, ఇతరులు : 0-1 సీట్లు రావొచ్చునని అంచనా వేసింది.
దేశం మొత్తం 543 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
బీజేపీ: 333 - 363
కాంగ్రెస్: 28-48
వైయస్సార్సీపీ: 21-22
డీఎంకే: 24-28
టీఎంసీ: 17-21
బీజేీడీ: 10-11
ఆమ్ ఆద్మీ పార్టీ: 5-7
ఇతరులు: 64-84.












Click it and Unblock the Notifications