కోరుకున్న ఆలయంలో దర్శనం, సేవల టికెట్లు ఇక నిమిషాల్లోనే- ఇలా చేస్తే చాలు..!!
Tirumala: కోరుకున్న ఆలయంలో టికెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు ప్రముఖ ఆలయాల్లో ఆన్ లైన్.. ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు పొందే విధానం అందుబాటులో ఉంది. కాగా, ఉన్న చోట నుంచి నిమిషాల్లో టికెట్లు తీసుకునే విధంగా అవకాశం కలిగింది. పలు ప్రముఖ ఆలయాల దర్శన.. సేవా టికెట్ల కోసం ప్రభుత్వం ఈ విధానం భక్తులకు అందు బాటులోకి తీసుకొచ్చింది.
ఈ విధానం ద్వారా సులభంగా టికెట్లు పొందేందుకు వీలు ఏర్పడింది. శ్రీశైలం సహా పలు ప్రముఖ ఆలయాల దర్శన.. సేవా టికెట్లు సులభంగా పొందేలా భక్తులకు అవకాశం ఏర్పడింది. రద్దీ రోజుల్లో సమస్య లేకుండా ఇంటి నుంచే టికెట్లు పొందే విధంగా ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, శ్రీకాళహస్తి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన దర్శనం టికెట్లు మొబైల్లోనే ఈజీగా బుక్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా ఉన్న చోటు నుంచే ఆన్లైన్లో నిమిషాల్లోనే దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర యాఫ్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆలయాలకు కానుకలు కూడా ఈ-హుండీ ద్వారా పంపే అవకాశం కల్పిస్తోంది.
బుకింగ్ విధానం
భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు. సేవలను సులువుగా పొందడానికి "95523 00009" అనే వాట్సాప్ నెంబర్ను ప్రవేశ పెట్టారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవలు పొందొచ్చు. ముందుగా మీ మొబైల్లో "9552300009" అనే నంబర్ సేవ్ చేసుకొని "Hi" అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే "దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ, శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దర్శనం.. సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం.. సేవా టికెట్లు పొందవచ్చు.












Click it and Unblock the Notifications