తిరుమలలో 20 లక్షల మంది భక్తులు, నెలలో హుండీ ఆదాయం ఎన్ని వందల కోట్లు అంటే?!

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల్లోని భక్తలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఎదురు చూస్తుంటారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి వెలుతున్నారు. ఎన్ని గంటలు అయినా పర్వాలేదని క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చమని వేడుకుంటారు.

ఎండకాలం, వానా కాలం, చలికాలం అని తేడా లేకుండా తిరుమల కొండ మీద ప్రతిరోజు వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. తిరమలలో శ్రీవారిని ఒక్కరోజులో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్న సందర్బాలు ఉన్నాయి. ఇలాంటిది తిరుమలలో వేసవి సెలవుల్లో రద్దీ ఎలాగుంటుందో ఊహించుకోవచ్చు. రెండు మూడు నెలల ముందే శ్రీవారిని దర్శించుకోవడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు వారి స్లాట్ టైమ్ లో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.

Tirumala Srivari Hundi s revenue in the month of April was Rs 101 63 crores

ఇక తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్బంగా తిరుమల కొండ మీదకు లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. గరుడ సేవ రోజు అయితే రెండు లక్షల మందికి పైగా తిరుమల కొండ మీద ఉంటారు. వేసవి సెలవుల సందర్బంగా ఏప్రిల్ నెలలో శ్రీవారిని లక్షలాది మంది దర్శించుకున్నారు. ఏప్రిల్ నెలలో తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామిని 20. 17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

తిరుమలలో ఏప్రిల్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో రూ. 101. 63 కోట్లు కానుకల రూపంలో సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏప్రిల్ నెలలో తిరుమలలోని కల్యాణకట్టలలో 8.08 లక్షల మంది శ్రవారి భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీనివాసం విశ్రాంతి భవనంలో కూడా తలనీలాలు సమర్పించుకున్నారు.

తిరుమలలో 39. 73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తిరుమలలో ఏప్రిల్ నెలలో 94. 22 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు. వరుస సెలవులు రావడం, పరీక్షలు పూర్తి కావడంతో మే నెలలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంటున్నారు. మే నెలలో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+