తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ttd:శ్రీవారి భక్తులకు తిరుపతి లడ్డూలాంటి వార్త

|
Google Oneindia TeluguNews

ttd:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఇక నుంచి బ్రేక్‌ దర్శనాలు కల్పించబోతున్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతోంది. దీంతో స్వామి వారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన వెంటనే రాత్రంతా క్యూలైన్లలో ఉన్న భక్తులకు దర్శనం కల్పిస్తారు. దీనివల్ల భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కలగబోతోంది. అంతేకాకుండా గదుల కేటాయింపులపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.

tirupati, tirumala, srivaru, break darshan

అంతేకాకుండా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కూడా మార్పులు చేశారు. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలుండగా వాటిని రద్దుచేసి ఉదయం 5.00 గంటల నుంచి 8.00 గంటలవరకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కల్పించనున్నారు. రాత్రి మొత్తం క్యూలైన్లలో ఉండే భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిల్లో కూడా మార్పులు చేయబోతున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కల్పించబోతున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారాంతాల్లో లక్ష దాటుతోంది. పెద్ద సంఖ్యలో వీఐపీలు రావడం, సిఫార్సు లేఖలతో దర్శించుకునేవారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో క్యూ లైన్లలో నిలబడే భక్తుల సంఖ్య పెరుగుుతోంది. డిసెంబరు 1వ తేదీ నుంచి దీన్ని అరికట్టనున్నారు.

English summary
Tirumala Tirupati Devasthanam (TTD) has given good news to the devotees of Lord Srivenkateswara Swamy, the living deity of Kali Yuga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X