చంద్రబాబుకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన చిరంజీవి - మోస్ట్‌ హార్డ్‌ వర్కింగ్ లీడర్‌ అని ట్వీట్‌

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్‌ చుట్టే తిరుగుతున్న టాలీవుడ్ పెద్దల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయాలు నడిపిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్‌లో అందరివాడుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవలో చిరంజీవి పలు ఆసక్తికర నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం, విపక్ష నేత కూడా అయిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్‌ చిరంజీవి ఓ ట్వీట్‌ చేశారు. ఇందులో చంద్రబాబుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా చంద్రబాబుతో అంతగా అనుబంధం ఉన్నట్లు కనిపించని చిరంజీవి.. ఈ ట్వీట్‌లో ఆయన్ను కీర్తిస్తూ వాడిన పదాలు చూస్తుంటే చిరంజీవిలో మార్పు కూడా కనిపిస్తోంది. దీంతో ఈ ట్వీట్‌ కూడా వైరల్‌ అవుతోంది.

tollywood hero chiranjeevi convey birthday wishes to tdp chief chandrababu with praise

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన ట్వీట్‌లో చిరంజీవి.. కష్టపడే తత్వం ఉన్న, నిబద్ధత కలిగిన రాజకీయ నేతల్లో ఒకరైన చంద్రబాబుకు హ్యాపీ బర్త్‌డే అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మంచి ఆరోగ్యంతో, సంతోషంగా, దీర్ఘాయుష్షుతో ప్రజలకు సేవ చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. చిరంజీవి నుంచి అరుదుగా వినిపించే పదాలతో కూడిన ఈ ట్వీట్‌పై చంద్రబాబు ఇంకా స్పందించలేదు. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఏపీలో అంతగా కనిపించని చిరంజీవి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు విషెస్‌ చెప్పడంపై చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+