Sreeleela: పవన్ పిఠాపురం పోటీపై శ్రీలీల ఎమోషనల్ ట్వీట్..!
ఏపీలో మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. రేపటితో అభ్యర్ధుల ప్రచారపర్వం ముగియబోతోంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఓ ఎత్తు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ మరో ఎత్తుగా మారింది. ఇక్కడ తొలిసారి పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. ఈ నేపథ్యంలో పవన్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తొలిసారి నటిస్తున్న హీరోయిన్ శ్రీలీల కూడా స్పందించింది.
పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ విజయానికి మద్దతుగా టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటికే పలువురు ట్వీట్లు పెడుతుండగా.. ఇప్పుడు శ్రీలీల కూడా అదే బాటలో ఇవాళ ట్వీట్ చేసింది. ఇందులో శ్రీలీల.. పవన్ గారెకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. సార్ మీ ఎన్నికల ప్రయాణం. మీరు కోరుకున్నదంతా సాధిస్తారని మరియు మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ శ్రీలీల తన ట్వీట్ ముగించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీలీల తన తర్వాతి సినిమా హీరో రాజకీయాల్లో గెలవాలంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని మెగా ఫ్యాన్స్, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటివరకూ టాలీవుడ్ లో మిగిలిన నటీనటుల ట్వీట్లకు భిన్నంగా ఎమోషనల్ గా శ్రీలీల చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.
My heartfelt wishes to @PawanKalyan sir on your election journey.
— Sreeleela14 (@SreeLeela_1) May 10, 2024
I hope you achieve everything you wish and keep all your promises.
I pray to God that you win with a huge majority in Pithapuram 🙏#TDPJanasenaBJP ❤️🔥✨












Click it and Unblock the Notifications