టీడీపీ ఎమ్మెల్యేతో జగపతిబాబు భేటీ!: రెండు గంటలు చర్చ, విషయమేంటి?
షూటింగ్ నిమిత్తం ఆయన రేపల్లెలోని ఒక హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా తన మిత్రుడైన స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను జగపతి కలుసుకున్నారు.
విజయవాడ: ఎప్పుడూ లేనిది ఓ ఎమ్మెల్యేతో జగపతి బాబు భేటీ అవడం కొత్త చర్చలకు దారితీసింది. కొంపదీసి ఆయనేమైనా రాజకీయాల వైపు మళ్లుతున్నారా? అని కొంతమంది అప్పుడే ఆరా తీయడం మొదలుపెట్టారు. కానీ అలాంటిదేమి లేదని కేవలం స్నేహపూర్వకంగానే ఈ భేటీ జరిగింది తప్ప రాజకీయాలకు ఇందులో తావు లేదని భేటీ అనంతరం జగపతిబాబు స్పష్టం చేశారు.
ఇంతకీ జగపతిబాబు టీడీపీ ఎమ్మెల్యేను ఎందుకు కలిశారంటే!.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో జగపతిబాబు నటిస్తున్న సినిమా ఒకటి కృష్ణా జిల్లా హంసలదీవిలో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ నిమిత్తం ఆయన రేపల్లెలోని ఒక హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా తన మిత్రుడైన స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను జగపతి కలుసుకున్నారు.

కుశల ప్రశ్నలు వేసుకున్న ఇద్దరు.. రెండు గంటల పాటు ఆయా విషయాలు చర్చించుకున్నారు. ఇదే సందర్భంగా షూటింగ్ కు అనువుగా ఉండే చుట్టు పక్కల లొకేషన్స్ గురించి జగపతిబాబుకు ఎమ్మెల్యే వివరించారు. పెనుమూడి, లంకెవానిదిబ్బ, నక్షత్రనగర్, దిండి ప్రాంతాలు షూటింగ్ కు అనుకూలంగా ఉంటాయన్నారు. భేటీ అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది స్నేహపూర్వకమైన భేటీయే తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.












Click it and Unblock the Notifications