తిరుపతి, చెన్నై వెళుతున్నవారికి ముఖ్య సూచన చేసిన కేంద్రం
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తోంది. ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. అయితే రైళ్ల రద్దీ ఎక్కువవడంతో ప్రధాన స్టేషన్లకు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువ సమయం వీటిని నిలిపివేయాల్సి వస్తోంది. దీనికి తోడు డబుల్ లైన్ ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రధాన నగరాల మధ్య మూడో లైనును నిర్మిస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-గూడూరు మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి.
జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనులు
విజయవాడ-గూడూరు మధ్య జరుగుతున్న పనులతోపాటు నాన్ ఇంటర్ లాకింగ్, ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కూడా జరుగుతుండటంతో విజయవాడ విజన్ పరిధిలో కొన్ని ముఖ్యమైన రైళ్లను వచ్చేనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు. విజయవాడమీదుగా నడిచే 37 రైళ్లను రద్దు చేసి మరో 38 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలు
కడప-విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487,174088)
విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (12713,12714)
హుబ్లీ - విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ (17329,17330)
విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్ (12711)
చెన్నై సెంట్రల్-విజయవాడ-చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12077,12078)
డోర్నకల్-విజయవాడ (07755)
విజయవాడ-డోర్నకల్ (07756)
విజయవాడ-భద్రాచలంరోడ్ (07979)
భద్రాచలంరోడ్-విజయవాడ (07278)
గుంటూరు-సికింద్రాబాద్ (17201)
సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్ ప్రెస్(17202)
విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన (12713)
సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన (12714)












Click it and Unblock the Notifications