TTD: దర్శనం - లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన..!!

Tirumala: తిరుమలలో భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తామని..దర్శనం సులభతరం చేస్తామని టీటీడీ చెబుతోంది. అక్టోబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్దమవుతోంది. తాజాగా ఆలయ మాడ వీధుల్లో భక్తుల సౌకర్యాల పైన అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఇక.. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం పైన వస్తున్న వార్తల పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది.

టీటీడీ స్పష్టత
వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టత ఇచ్చింది. టీటీడీ ప్రతీరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

TTD clarifies over darshan for elderly and handicapped people

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇక, తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పై సమీక్ష చేసారు.

గరుడ వాహన సేవ
తిరుమలలోని నాలుగు మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ మరియు నిష్క్రమణ, హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన మండపం నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ నిష్క్రమణ పాయింట్ల సమాచారాన్ని సేకరించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+