TTD: భక్తుల అన్నప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం - ఇక నుంచి..!!

Tirumala: టీటీడీ నూతన పాలక మండలి కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. సామాన్య భక్తులకు దర్శనం త్వరగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యల పైన కసరత్తు చేస్తోంది. ఇక, తిరుమలలో భక్తుల కు కోరినన్న లడ్డూలు ఇచ్చేలా అవసరమైన మార్పులు మొదలు పెట్టింది. ఆనంద నిలయం అనంతస్వర్ణమయ పథకం తిరిగి ప్రారంభించింది. ఇదే సమయంలో అన్నదాన ప్రసాదం నాణ్యత పైన ఫోకస్ చేసింది. ఆ దిశగా తాజాగా టీటీడీ కీలక ఒప్పందం చేసుకుంది.

తాజా ఒప్పందం
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా అవసరమైన మార్పులకు నిర్ణయించింది. టీటీడీ నూతన పాలక వర్గం తొలి సమావేశంలోనే శ్రీవారి
భక్తులకు నిత్య అన్న ప్రసాదం మెనూలో అద‌నంగా మ‌రొక‌ ప‌దార్థాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అన్నప్రసాదం నాణ్యత పెంచటంతో పాటుగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా తిరుమలలోని వంటశాల ఆధునీకరణకు నిర్ణయించింది. అందులో భాగంగా మెకనైజేషన్ తో పాటుగా వంటశాలలను పూర్తిగా మార్పు చేసేందుకు టీవీఎస్ మోటార్స్ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది.

TTD decided to modernise Annaprasada centralized kitchen at Tirumala

అన్నప్రసాదం కోసం
ముందుగా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం లో పైలెట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించేలా నిర్ణయం జరిగింది. ఇప్పటికే టీవీఎస్ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని ఎంటీవీఏసీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్స్ తో పాటుగా కొత్తగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాల, పద్మావతి అతిథిగృహాలను పరిశీలన చేసారు. అక్కడ అందుబాటులో ఉన్న పరికరాలు, అన్నప్రసాదం తయారీ విధానం గురించి సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆధునిక పరికరాలు సమకూర్చేందుకు టీటీడీతో ఒప్పందం చేసుకునేందుకు నిర్ణయించింది.

నాణ్యత పెరిగేలా
తాజా ఒప్పందం ప్రకారం అన్నప్రసాద వంటశాలను పూర్తిగా ఆధునీకరించేలా అవసరమైన అన్ని ప్రతిపాదలతో పాటుగా కొత్త డిజైన్లను టీవీఎస్‌ఎం టీటీడీకి అందిస్తుంది. అందించనుంది. అదే విధంగా వంటశాలను పూర్తిగా మార్చే నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్ల బాధ్యత టీవీఎస్‌ఎం తీసుకో నుంది. ఇందుకు అవసరమయ్యే ఖర్చు ఆ సంస్థే భరిస్తుంది. అన్నదాన ప్రసాదం తయారీకి ఆధునిక పరికరాలను వినియోగం లోకి తీసుకురావటం ద్వారా సకాలంలో నాణ్యమైన అన్న ప్రసాదం అందించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటు, అన్నదానంలో నాణ్యత పెంచేందుకు రైస్‌మిల్లర్ల సంఘం నుంచి బియ్యన్ని సేకరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+