వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. ఆదివారం నాడు 86,091 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. ఈ నెల 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు నిర్ణయాలను తీసుకున్నారు. వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

భక్తుల భద్రత దృష్ట్యా తుంబురు తీర్థానికి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో తెల్లవారు జామున 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వాటిని పంపిణీ చేయడానికి 100 మంది శ్రీవారి సేవకులను వినియోగించాలని నిర్ణయించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది మోహరింపజేయనున్నారు.
తుంబురు తీర్థానికి చాలా దూరం నడవాల్సి ఉండటంతో వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలు, దీర్ఘవ్యాధిగ్రస్తులు, గుండె- శ్వాస కోస సంబంధిత సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు. భక్తులు తమ వెంట ఎటువంటి వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి సూచించారు. పోలీసు, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తుంబురు తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు.
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!! -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం












Click it and Unblock the Notifications