తుఫాన్ నేపథ్యంలో తిరుమల టీటీడీ ఏర్పాట్లు: క్యూలైన్లల్లో

అతి తీవ్ర తుఫాన్ మురాసు.. ఏపీ తీరాన్ని తాకింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఈ తెల్లవారు జామున తుఫాన్ తీరం దాటడం ప్రారంభించిందని భారత వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. ఈ సమయంలో తీరం వెంట గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తోన్నాయి. దీని తీవ్రత కారణంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. దీనిపై తిరుమల పద్మావతి అతిథి గృహంలో వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూలైన్ బయటి వరకు రాకుండా చూడటంలో గానీ, అన్న ప్రసాదాల పంపిణీలో గానీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశించారు.

TTD have taken measures to ensure devotees visiting Tirumala for Srivari Darshan in cyclone Murasu

భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని, సాధ్యమైనంత వరకు క్యూ లైన్లు వెలుపలకు రాకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వర్షాల వల్ల అన్నప్రసాదాల పంపిణీకి ఎక్కడా అంతరాయం కలగకూడదని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని చెప్పారు.

ఏపీలో తీరాన్ని తాకిన తుఫాన్- బీభత్సం: అతి భారీ వర్షాలు
ఏపీలో తీరాన్ని తాకిన తుఫాన్- బీభత్సం: అతి భారీ వర్షాలు

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని విద్యుత్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో వర్షాల కారణంగా బండరాళ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, డౌన్ ఘాట్, అప్ ఘాట్ రోడ్లలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్

అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. భక్తులందరూ సులభంగా శ్రీవారి దర్శనం చేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ మనోహరం, ఎస్ఈ వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+