TTD: మహాకుంభమేళాలో శ్రీవారి భక్తులకు ప్రత్యేకం- తాజా నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపు (మంగళవారం) దర్శనాలకు సంబంధించి ప్రస్తుతం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక, ఈ ఉదయం నుంచి త్రివేణీ సంగమంలో మహ కుంభమేళా ఆరంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో కుంభ మేళా కేంద్రంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి నమూనా ఆలయం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహా కుంభమేళా ఆరంభమైంది. ఈ ఉదయం నుంచి సాదువులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు. కుంభమేళా వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసు కుంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి నమూన ఆలయాన్ని ప్రయాగ్ రాజ్ లోని నాగవాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్-6 వద్ద ప్రారంభించింది. టీటీడీ అధికారులు ఈ నమూన ఆలయాన్ని శోభాయమానంగా తీర్చి దిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలలో శ్రీవారి వైభవాన్ని తెలియజేసేందుకు టీటీడీ నమూన ఆలయాన్ని ఏర్పాటు చేసింది.

సంప్రదాయ బద్దంగా
కుంభమేళాకు వచ్ఛే భక్తులందరూ శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ముందుగా తిరుచ్చి పై స్వామి అమ్మవార్లను త్రివేణి సంగమం చెంతకు వెళ్లి పవిత్ర గంగా జలాలను కలషంలో నింపుకుని తీసుకువచ్చి ఆలయంలో ప్రోక్షణ చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవాచ నం, తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీవారి చల ప్రతిష్ట, వాస్తు హోమం, నిత్య హోమం, ఇతర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి.

వైకుంఠ ద్వార దర్శనం
పుణ్య జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పిం చారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనాలకు అనుమతించి ప్రసాదాల వితరణ చేశారు. ఇటు తిరుమలలో ఏకాదశి, ద్వాదశి వేళ భక్తులు 1,31,107 మంది భక్తులు శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. జనవరి 19వ తేదీ వరకు దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపు (మంగళ వారం) దర్శనాలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు జారీ ప్రక్రియ కొనసాగుతోంది. తొక్కిసలాట ఘటనతో టికెట్ల జారీ లో టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు తొక్కిసలాట ఘటన బాధితుల కు టీటీడీ పరిహారం పంపిణీ చేస్తోంది.












Click it and Unblock the Notifications