TTD: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా..టీటీడీ కీలక అప్డేట్..!!

Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల సదుపాయాలు.. సేవలను మరింతగా పెంచే విధంగా టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఏఐ వినియోగంతో రెండు గంటల సమయంలోనే శ్రీవారి దర్శనం జరిగేలా కసరత్తు కొనసాగుతోంది. అలిపిరి వద్దే వసతితో పాటుగా బేస్ క్యాంపు ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పైన కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇప్పుడు శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది. టోకెన్ల జారీలో మార్పులు తీసుకొచ్చింది.

స్వామివారి సన్నిధిలో అంగ ప్రదిక్షణ చేయాలనుకునే భక్తులు కూడా అధికంగా ఉంటారు. అంగ ప్రదక్షిణ చేసే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంగ ప్రదక్షిణ చేసే భక్తులు రాత్రి 12 గం. సమయంలో శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద బట్టలతో నే మూడు మునకలు వేసి అలాగే తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్ళాలి. రిపోర్టింగ్ సమయం.. రాత్రి.. ఒంటి గంట.. కనుక ఆ సమయానికే క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డును పరిశీలన చేసిన తరువాత భద్రతా సిబ్బంది భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది. వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ మొదలైన తరవాత భక్తులను అంగ ప్రదక్షిణ కు అనుమతిస్తారు.

ttd-made-key-changes-in-anga-pradikhsana-token-system-details-here

కాగా, ఇప్పుడు అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజుకు 750 చొప్పున ఆన్ లైన్ డిప్ విధానంలో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసి ముందు వచ్చిన వారికి ముందు పద్దతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఒక పై మూడు నెలల ముందుగానే ఆన్ లైన్ లో విడుదలవుతాయని.. మార్పును గమనించి బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు. కాగా, టీటీడీ తాజాగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. 31వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. అయితే, ఈ సారి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ విధానంలోనే టికెట్లు జారీ చేయాలని టీటీడీ భావిస్తోంది. దీనికి సంబంధించి తేదీలను ప్రకటించనుంది. కొంత మొత్తంలో ఆఫ్ లైన్ లోనూ ఇవ్వాలనే ప్రతిపాదన తో.. తుది నిర్ణయం పైన కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+