Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: అన్న ప్రసాదంలో జెర్రీ పడిందని దుష్ప్రచారం, టీటీడీ

తిరుమలలోని మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ అధికారులు శనివారం సాయంత్రం స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ అన్నప్రసాదాలను తయారుచేస్తారు.

అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు ఆశ్చర్యకరం వేస్తోందని టీటీడీ అధికారులు అంటున్నారు.

ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రంగా భావించాల్సి వస్తుంది టీటీడీ అధికారుల అంటున్నారు.

TTD officials have clarified that there is no jerry in the Tirumala Srivari Anna Prasad

దయచేసి భక్తులు ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని శనివారం సాయంత్రం టీటీడీ విజ్ఞప్తి చేసింది.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సంగీత కార్య‌క్ర‌మాలు

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన శ‌నివారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

తిరుమల నాద నీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన మునిరత్నం, కృష్ణమూర్తి, కృష్ణారావు బృందం మంగళ ధ్వని, రాజమండ్రికి చెందిన శ్రీ రామచంద్ర ఘనాపాటి వేదోపదేశం, లోక కళ్యాణ ప్రదం" అనే అంశంపై ఉపన్యసించారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి శ్రీనిధి బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

ఆస్థాన మండపంలో హైదరాబాద్ కు చెందిన శ్రీమతి సీతారామాంజునమ్మ విష్ణు సహస్రనామ పారాయణం, బెంగళూరుకు చెందిన శ్రీమతి రేష్మ మధుసూదన్ బృందం భక్తి సంగీతం, హైదరాబాదుకు చెందిన శ్రీ జగన్మోహన ఆచార్యులు, ఆళ్వార్ ప్రబంధాలలో భగవద్గీత అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం తిరుపతికి చెందిన శ్రీమతి సుశీల బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. తిరుపతికి చెందిన శ్రీమతి వరలక్ష్మి బృందం హరికథ గానం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+