టీటీడీ బిగ్ ప్లాన్..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. మంగళవారం నాడు 76,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,766 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.07 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

TTD plans setting up a new trust for children s healthcare

తిరుపతిలోని శ్రీపద్మావతీ చిన్నపిల్లల హృదయాలయంలో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలను దృష్టిలో పెట్టుకుని టీటీడీలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాద్యాలను పరిశీలించాలని కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ- శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీం ఉందని, ఈ స్కీం కింద లక్ష రూపాయలు దాత విరాళం అందిస్తే నిరాదరణకు గురైన పేద వర్గాలకు చెందిన ఒక పిల్లవాడికి ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందని అన్నారు.

టీటీడీలో ఇప్పటికే ఉన్న పలు ట్రస్ట్ తరహాలో నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని అన్నారు. పద్మావతి ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది.. చిన్న పిల్లలకు చక్కటి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

చిన్న పిల్లల గుండె సర్జరీల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు, అత్యవసర మందులు ఏర్పాట్లు చేసుకోవాలని శ్యామలరావు అన్నారు. నూతన భవన నిర్మాణం తాజా పరిస్థితిపై ఆయన ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేసి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఆయన చిన్న పిల్లల ఐసీయూ బ్లాక్, జనరల్ వార్డు, ఓపి బ్లాక్ లో పిల్లలకు అందుతున్న వైద్యసేవలపై డాక్టర్లు, పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై వాళ్లు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+