టీటీడీ అన్నప్రసాదాల తయారీ బాధ్యతలు ఇకపై: మెనూలో..!!

తమ ఆధీనంలోని అన్ని ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. తొలిదశలో 60 ఆలయాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడుల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో అన్నప్రసాద వితరణ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం- దశలవారీగా తమ ఆధీనంలోని మిగిలిన ఆలయాల్లో కూడా దీన్ని అమలు చేస్తుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి తమ ఆధ్వర్యంలో ఉండే అన్ని స్థానిక ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేపట్టొచ్చు. మెనూలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అదే సమయంలో స్థానిక ఆలయాల్లో ప్రసాద వితరణ, తయారీకి ధార్మిక సంస్థలు, మఠాలకు అప్పగించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు 1985 ఏప్రిల్ 6వ తేదీన శ్రీకారం చుట్టింది టీటీడీ. అనంతరం 1994 ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది.

TTD Prepares to Serve Annaprasadam Across 60 Temples

2011 జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. నవంబర్ 15 నాటికి రూ. 2,316 కోట్లు ఈ ట్రస్ట్ కు డిపాజిట్ గా జమ అయ్యాయి. వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు రాంబగీచ బస్టాండు, ఏఎంసీ, సీఆర్‌ఓ, పీఏసీ-1 వద్ద ఫుడ్‌ కౌంటర్లు, పీఏసీ- 2, 4, 5 హాల్స్, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, 2 ల్లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణ గిరి షెడ్స్, బయటి క్యూ లైన్స్ లల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలో సాధారణ రోజుల్లో 1.80 లక్షల నుండి 1.90 మంది, వారాంతంలో 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాలలో గరుడసేవ రోజున సగటున రెండు లక్షల మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.

తిరుచానూరు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి, శ్రీనివాసం, విష్ణునివాసం, టీటీడీ ఆసుపత్రులు, ఒంటిమిట్టలోని శ్రీ కోందరరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సదరు కేంద్రాలలో సాధారణ రోజులలో 15,000 నుండి 16,000 మంది, వారాంతపు రోజుల్లో 18,000 నుండి 20,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో ఉండే అన్ని స్థానిక ఆలయాల్లో కూడా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+