శ్రీవారి సుప్రభాత సేవ పునః ప్రారంభ సేవ తేదీని వెల్లడించిన టీటీడీ

Tirumala: ప్రఖ్యాత పుణక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుండటం, కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో శ్రీవారిని దర్శంచుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

జనవరి నెల మొత్తం మీద నిర్వహించే విశేష ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల జాబితాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వహించే పెద్దశాత్తుమొర‌తో ఇవి ఆరంభం అయ్యాయి. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఈ అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది.

TTD release the list of special days to be observed in the month of January 2024 in Tirumala

⁠5వ తేదీన శ్రీ‌వారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ముగుస్తాయి. 6న తిరుమ‌ల శ్రీ‌వారు తిరుమ‌ల‌నంబి స‌న్నిధికి వేంచేపు చేస్తారు. 7వ తేదీన స‌ర్వ ఏకాద‌శి. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తోన్నారు.⁠ 9వ తేదీన తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం కార్యక్రమాన్ని చేపడతారు.

14వ తేదీన భోగిపండుగ‌. అదే రోజున ధ‌నుర్మాసం ముగుస్తుంది. 15వ తేదీన మ‌క‌ర సంక్రాంతి. వేడుకలను నిర్వహిస్తారు అధికారులు. ఈ సందర్బంగా శ్రీవారి ఆలయంలో సుప్ర‌భాత సేవను పునఃప్రారంభిస్తారు. క‌నుమ పండుగ‌ ఉత్సవాల సందర్భంగా 16న తిరుమ‌ల శ్రీ‌వారు పార్వేట మండ‌పానికి వేంచేపు చేస్తారు.

25వ తేదీన శ్రీ‌రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి పర్వదినాన్ని టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 28న తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం. 31న కూర‌త్తాళ్వార్ వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం వేడుకలతో ఈ విశేష ఉత్సవాలు ముగుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+