సప్త సాగరాలు దాటనున్న శ్రీవారు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం నాడు 63,729 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,957 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. దీపావళి పండగ సెలవుల వల్ల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

TTD set to conduct Srinivasa Kalyanam in 8 countries of the UK Ireland and Europe from Nov 9

విదేశాల్లో శ్రీనివాసుడి కల్యాణోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్, యూరోప్ దేశాల్లో నెలన్నర రోజుల పాటు దశలవారీగా ఈ ఉత్సవాలను నిర్వహించతలపెట్టారు. దీనికి సంబంధించిన వేదికలు, తేదీలను కూడా ఖరారు చేశారు.

నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు ఇంగ్లాండ్, ఐర్లాండ్, యూరప్‌లోని ఎనిమిది దేశాల్లో శ్రీనివాస కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించనున్నారు. దీనికోసం ఆయా దేశాల్లో మొత్తం 13 నగరాలను ఎంపిక చేశారు. నవంబర్ 9వ తేదీన ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ మేరకు జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌లో నివసించే సూర్య ప్రకాష్ వెలగ, కృష్ణ జవాజీ మంగళవారం టీటీడీ ఈవో జే శ్యామలరావుతో మర్యాదపూరకంగా కలిశారు. శ్రీనివాస కళ్యాణోత్సవాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యలో వీటిని నిర్వహిస్తామని ఈవోకు వివరించారు.

ఆయా దేశాల్లో నివసించే తెలుగు వాళ్లు, అక్కడి అసోసియేషన్లు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో కలిసి టీటీడీ అర్చకులు, వేద పండితులు, అధికారులు శ్రీనివాస కల్యాణోత్సవాన్ని వైభవోపేతంగా జరపాలని నిర్ణయించారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు.

నవంబర్ 9వ తేదీన బెల్‌ఫాస్ట్- ఐర్లాండ్, 10న డబ్లిన్- ఐర్లాండ్, 16న బేసింగ్‌స్టోక్- యూకే, 17న ఐండ్‌హోవెన్- నెదర్లాండ్స్, 23న హాంబర్గ్- జర్మనీ, 24న పారిస్- ఫ్రాన్స్, 30న వార్సా- పోలాండ్‌లో శ్రీనివాస కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు.

డిసెంబర్ 1వ తేదీన స్టాక్‌హోమ్- స్వీడన్, 7న ⁠మిల్టన్ కీన్స్- యూకే, 8న గ్లౌసెస్టర్- యూకే, 14న ఫ్రాంక్‌ఫర్ట్- జర్మనీ, 15న బెర్లిన్- జర్మనీల్లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపడతారు. డిసెంబర్ 21వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించే కల్యాణోత్సవంతో ఇది ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+