TTD : తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ పేరు మరోసారి మార్పు..
శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్ సైట్ పేరును మార్చింది. ఇప్పటివరకు టిటిడి వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.inగా ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in గా మార్పు చేయడం జరిగింది. ఈ మార్పును శ్రీవారి భక్తులు గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.
టిటిడి మరో కిలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ను మార్చడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరును మార్చు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్'లో భాగంగా ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్చామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది.

భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా : శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా ఒకే సంస్థ.. ఒకే వెబ్‌సైట్.. ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో అధికారిక ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను మార్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇక నుంచి తిరుమల శ్రీవారి భక్తులు ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని సూచలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చే 60కి పైగా స్థానికంగా ఉన్న ఆలయాలు, అనుబంధ ఆలయాలకు సంబంధించి స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఈ కొత్త వెబ్‌సైట్‌ను తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం నాడు టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించడం జరిగింది. భక్తులు ఇకనుంచి tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ కాకుండా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసుకోవాలని టీటీడి అధికారులు తెలిపారు. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అని ఉండేది. ఆ తర్వాత టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చడం జరిగింది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in గా మార్చడం జరిగింది.












Click it and Unblock the Notifications