TTD: శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక యాప్ - శిక్షణా ముహూర్తం ఫిక్స్, వీరికే ఛాన్స్..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవకులకు సంబంధించి గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్ ను టీటీడీ ఖరారు చేసింది. టీటీడీలోని పలు విభాగాలతో పాటుగా పరిధిలోని ఆస్పత్రుల్లోనూ వీరి సేవలను వినియోగించుకోనున్నారు. శ్రీవారి సేవకుల విభాగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. సంస్కరణలలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను సెప్టెంబర్ 3న ప్రారంభించామని వెల్లడించారు.
తాజా సమీక్షలో ఈవో కీలక సూచనలు చేసారు. శ్రీవారి సేవకుల ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేందుకు మరింత పటిష్ట ప్రణాళికలు, బోధన పాఠ్యాంశాలను రూపొందించాలని సూచించారు. శిక్షణ పొందిన ట్రైనర్లు, సూపర్వైజర్లు సేవకులకు శిక్షణ ఇస్తారని, దీనివల్ల శ్రీవారి సేవలో మరింత నాణ్యత పెరుగుతుందన్నారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఉదయం విధానపరమైన అంశాలపై శిక్షణ , మధ్యాహ్నం వివిధ సేవా కేంద్రాలలో ఫీల్డ్ విజిట్‌లకు వెళ్లి పరిశీలించేలా రూపొందిచాలని సూచించారు.

గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్‌పై ప్లానింగ్ విభాగానికి చెందిన నలుగురు నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ శిక్షణలో 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవ యొక్క ఆధ్యాత్మిక మూలాలు, శ్రీవారి సేవ పరిణామ క్రమం, వివిధ సందర్భాలలో సేవ ప్రాముఖ్యత, ప్రత్యేక రోజులలో సేవ నిర్వహణ, పటిష్ట సేవ అందించేందుకు నైపుణ్యాలు, స్పూర్తిధాయకమైన నాయకత్వం, సులభ పద్దతిలో అందరికి అర్థమయ్యేలా, ఆదర్శ సేవకుడి లక్షణాలు, పలు బాషలలో ప్రాథమిక నైపుణ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications