ఏపీ ఓటర్లు పట్టం కట్టేది ఆ పార్టీకే: తేల్చి చెప్పిన టీవీ9 లేటెస్ట్ సర్వే

TV9 Bharatvarsh opinion poll 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది.

నాలుగో విడతలో..

లోక్‌సభ ఎన్నికలన్నీ ఏడు దశల్లో పూర్తవుతాయి. తొలి దశ- ఏప్రిల్ 19, రెండ విడత- ఏప్రిల్ 26, మూడో విడత- మే 7, నాలుగో విడత- మే 13, అయిదో విడత- మే 20, ఆరో విడత- మే 25, ఏడో విడత- జూన్ 1వ తేదీన ముగుస్తాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఏపీ, తెలంగాణల్లో ఒకే విడతలో పోలింగ్ ముగుస్తుంది.

TV9 Bharatvarsh Opinion Poll predicts YSRCP will get majority Lok Sabha seats in AP

సర్వేలు ఏం చెబుతున్నాయి?

ఇప్పటివరకు వెలువడిన అన్ని ఒపీనియన్ పోల్స్, సర్వేలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. వార్ వన్ సైడ్ అంటూ తేల్చి చెప్పాయి. వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జన్‌మత్, ఇండియా టీవీ- ఐఎన్ఎక్స్ వంటి జాతీయ సంస్థలు అంచనా వేశాయి.

టీవీ9 ఒపీనియన్ పోల్..

తాజాగా- టీవీ9 భారత్‌వర్ష్ తన ఒపీనియన్ పోల్‌ వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఒపీనియన్ పోల్ వివరాలు అవి. పీపుల్స్ ఇన్‌ సైడ్, పోల్స్‌ట్రాట్.. వంటి సంస్థల సహకారంతో దీన్ని పూర్తి చేసింది.

వైసీపీకి ఎన్ని?

రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో మెజారిటీ సీట్లు అంటే 14 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగిస్తారు. మిగిన 11 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ- జనసేన- బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఇందులో టీడీపీ- 7, బీజేపీ- 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటారని వివరించింది.

అసెంబ్లీలో ఎన్ని?

ఈ ఎన్నికల్లో 98 అసెంబ్లీ నియోజకవర్గాలతో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని టీవీ9 భారత్‌వర్ష్ అంచనా వేసింది. వైఎస్ఆర్సీపీకి లభించే లోక్‌సభ స్థానాలను ప్రాతిపదికన తీసుకుంటే ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 98. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కంటే ఈ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+