ఫ్రెండ్స్‌ను కొట్టి.. పబ్‌లో గర్ల్స్‌తో అసభ్య ప్రవర్తన: అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల పబ్‌లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బౌన్సర్లలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కథనం ప్రకారం.. కొంతమంది యువతులు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని పబ్‌కు వచ్చారు.

ఆ సమయంలో యువతుల పట్ల కొంతమంది బౌన్సర్లు అసభ్యంగా ప్రవర్తించారు. బౌన్సర్లను వారించేందుకు యువతి స్నేహితులు ప్రయత్నించారు. దాంతో తమను అడ్డుకుంటారా అని ఆగ్రహించిన బౌన్సర్లు... యువతులతో వచ్చిన స్నేహితుల పైన దాడి చేశారు.

Two bouncers arrested by Hyderabad police

ఆ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పబ్ సిబ్బంది వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పబ్‌కు చేరుకొని.. సిబ్బంది వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. బౌన్సర్ల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

యువతిని వేధిస్తున్నాడని వార్డు బాయ్ పైన కేసు

యువతిని వేధిస్తున్నాడంటూ ఎర్రగడ్డ మానకిస రోగుల చికిత్సాలయంలోని వార్డు బాయ్‌ను బాధితురాలి బంధువులు తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతున్న ఓ రోగి వద్ద బాధిత యువతి అటెండర్‌గా ఉంటోంది. ఆసుపత్రిలో రోగులకు భోజనం సరఫరా చేసే వార్డుబాయ్ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో అతనిని కొట్టి పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+